యువతలో విజయ కాంక్షను రగిల్చే అబ్దుల్ కలాం……

Spread the love

దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా.. యువతలో ఎదగాలన్న కాంక్షను రగిల్చే సూక్తులు మీకోసం..

దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసలైన భారత రత్నం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపారు. 1931లో జన్మించిన కలాం.. రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారు. పదవీ కాలం పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోకుండా.. తనకు ఇష్టమైన బోధన పట్ల మక్కువ చూపారు. ఐఐఎం షిల్లాంగ్‌లో అధ్యాపకుడిగా చేరారు. 2015 జూలై 27న షిల్లాంగ్ ఐఐఎంలో లెక్చర్ ఇస్తూ.. కుప్పకూలిపోయారు.

కలాం జీవితం మొత్తం విశ్రాంతి లేకుండా పని చేశారు. తొలి విజయం సాధించాక ఆగిపోకండి.. మొదటిసారి గెలిచి, రెండోసారి ఓడితే.. తొలి విజయం అదృష్టవశాత్తూ వచ్చిందంటారు.. అని యువతకు కలాం సందేశాన్నిచ్చారు. కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడని కలాం చెప్పిన సూక్తి యువతకు ఆదర్శం. మనిషికి కష్టాలు ఎంతో అవసరం… కష్టాలు వచ్చినప్పుడే.. విజయాన్ని ఆస్వాదించగలం అని ఆయన జీవిత సారాన్ని భోధించారు.

పురస్కారాలు

సంవత్సరంపురస్కారంఅందచేసినవారు
2014సైన్స్ డాక్టరేట్ఎడిన్బర్ విశ్వవిద్యాలయం
2012గౌరవ డాక్టరేట్సైమన్ ప్రేజర్ విశ్వవిద్యాలయం
2011IEEE గౌరవ సభ్యత్వంIEEE
2010ఇంజనీరింగ్ డాక్టర్వాటర్లూ విశ్వవిద్యాలయం
2009గౌరవ డాక్టరేట్ఒక్లాండ్ యూనివర్సిటీ
2009హూవర్ పతకంASME ఫౌండేషన్, USA
2009ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డుకాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA
2008ఇంజనీరింగ్ డాక్టర్నాణ్యంగ్ టెక్నాలజి విశ్వవిద్యాలయం,సింగాపుర్
2007కింగ్ చార్లెస్ II పాతకంరాయల్ సొసైటీ, UK
2007సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK
2000రామానుజన్ అవార్డ్ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై
1998వీర్ సావర్కర్ అవార్డుభారత ప్రభుత్వం
1997నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారంభారత జాతీయ కాంగ్రెస్
1997భారతరత్నభారత ప్రభుత్వం
1994గౌరవనీయులైన ఫెలోగాఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం)
1990పద్మ విభూషణ్భారత ప్రభుత్వం
1981పద్మ భూషణ్భారత ప్రభుత్వం

 

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading