పక్క రాష్ట్రాలను చూసి మనం కాపీ కొట్టడంకాదు..
మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు కాపీ కొట్టడం….

jagan
Spread the love

!!!
………………………………
వై.వి.రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, సెల్ :9121772587
………………………………
1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి అయనను పెద్ద విజనరీగా చిత్రీకరించడానికి ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు లాంటి పాలకుడు ఉండటం తెలుగు ప్రజలు అదృష్టం అన్నట్లు ఎల్లో పత్రికలు, టీవీలు చూపించేవి.చంద్రబాబు అసమర్ధతను, అవినీతిని, పాలనలో తప్పిదాలను ఎల్లో మీడియా చాలా తెలివిగా కప్పిపుచ్చేది. అంతేకాదు..ప్రపంచంలోనే చంద్రబాబు అంతటి విజనరీ ఉన్న పాలకుడు లేడనట్లు ఎల్లో రాతలు సాగేవి . చంద్రబాబు ఆలోచనలకు ప్రతిరూపాలు ఎల్లో పత్రికలు. చంద్రబాబు అవినీతి కల్పవృక్షాలు ఎల్లో టీవీలు. చంద్రబాబు దోపిడీకి కప్పిపుచ్చే సాధనం ఎల్లో మీడియా. చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు. ఐదేళ్లు నవ్వాంధ్రకు సీఎంగా పని చేశారు. మొత్తం 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏనాడైనా , ఏ ఒక్క పథకంలోనైనా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కాని..నవ్యాంధ్ర కాని..దేశానికి మార్గదర్శకంగా నిలిచాయా?. నిలవలేదు. ఇది అక్షర సత్యం. ఐటీ నేనే తెచ్చాను..కంప్యూటర్‌ నేనే కనిపెట్టానే అని చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో ఐటీలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దలేకపోయారు. అప్పుడు ఇప్పుడు బెంగళూరే ఐటీలో ప్రథమంగా ఉంది.చంద్రబాబు హయాం కంటే వైఎస్‌ఆర్‌ పాలనలోనే ఐటీ ఎగుమతులు ఎక్కువుగా ఉండేవి. కాని..ఎల్లో మీడియా దృష్టిలో చంద్రబాబు పెద్ద విజనరీ. విజనరీ అంటే పక్క రాష్ట్రాలను, దేశాలను చూసి మనం కాపీ కొట్టడం కాదు, మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు, ఇతర దేశాలు కాపీ కొట్టాలి. చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఇలా జరిగిందా?. చంద్రబాబు, ఆయనను మోసే ఎల్లో మీడియా సమాధానం చెప్పగలదా?. చంద్రబాబు దగ్గర సమాధానం ఉండదు..!. ఎల్లో మీడియా దగ్గర సమాధానం ఉండదు..!

కర్ణాటక సీఎం యడియూరప్పకు మార్గదర్శిగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి..!

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు. రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకోవడమే కాదు అంత కంటే వేగంగా అమలు చేస్తున్నారు.
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అధికార, అభివృద్ది వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులు ప్రకటించారు. ఏపీలోని మూడు ప్రాంతాలకు సమాన ఫలాలు అందేలా నిర్ణయం తీసుకున్నారు.దీనిని స్వాగతించని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఇక ఎల్లో మీడియా శివాలెత్తినట్లు అసత్య వార్తలు ప్రచారం చేస్తుంది. కాని..పక్క రాష్ట్రం కర్ణాటక మాత్రం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయంలోని లోతును, విజన్‌ను అర్ధం చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు ఉత్తర కర్ణాటకకు దాదాపు 500 కి.మీ దూరంలో ఉంటుంది.బీజేపీకి బాగా పట్టున్న ప్రాంతం ఉత్తర కర్ణాటక. సీఎం యడియూరప్ప కూడా ఉత్తర కర్ణాటకకు చెందిన నాయకుడు. బెంగళూరు దూరమనే భావన ఉత్తర కర్ణాటక ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో యడియూరప్ప కదిలారు.బెంగళూరులోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉత్తర కర్ణాటకకు తరలించాలని అసెంబ్లీ తీర్మానం చేయించారు. ఆంధ్రలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అధికార, వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లుగానే యడియూరప్ప అడుగులేశారు. ఈ విషయంలో కర్ణాటక సీఎం యడియూరప్పకు మార్గదర్శిగా నిలిచారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి.

‘దిశ’ చట్టంతో దేశానికి దిశానిర్దేశం…!

కొన్ని సంఘటనలు చట్టాలకు ఊపిరి పోస్తాయి. కొన్ని ఘటనలు పాలకులకు కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. మరికొన్ని ఘటనలు నాయకులు ‘దిశ’నిర్దేశం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ శివార్‌లో జరిగిన ఘటన ఏపీలోని ఓ కొత్త చట్టానికి ప్రాణం పోసింది. తెలంగాణ రాష్ట్ర పాలకులు కూడా స్పందించనంత వేగంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌ శివారులో జరిగిన ఘటనలు ఏపీలో జరగకుండా తక్షణ చర్యలకు దిగారు. మహిళలకు రక్షణగా తమ ప్రభుత్వం ఉంటుందని ‘దిశ’చట్టంతో చాటి చెప్పారు. ‘దిశ’ చట్టాన్ని ప్రకటించడమే కాదు అంతే వేగంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ‘దిశ’ యాప్‌ను తీసుకొచ్చారు. ఏపీలో తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం గురించి ఇప్పుడు భాతరదేశం మాట్లాడుకుంటుంది. మూడు రోజుల క్రితం మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.’దిశ’ చట్టం గురించి అడిగి తెలుసుకున్నారు. విధివిధానాలు గురించి ఆరా తీశారు.’దిశ’లాంటి మంచి చట్టం తీసుకొచ్చినందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అంతేకాదు..ఒడిశా, పలు రాష్ట్రాలు ఇప్పుడు ‘దిశ’ చట్టం దిశగా అడుగులు వేస్తున్నాయి.

పోలీసుల వీక్లీ ఆఫ్‌లతో చరిత్ర సృష్టించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి..!

పోలీస్‌ వ్యవస్థ. వామ్మో వాళ్ల హృదయాలు కఠినంగా ఉంటాయి. బ్రిటీష్ కాలం నాటి చట్టాలు. బ్రిటీష్ కాలం నాటి ఆలోచనలు. బ్రిటీష్ కాలంనాటి సెక్షన్లు. బ్రిటీష్‌ కాలం నాటి సెలవులులేని వ్యవస్థ. పోలీసులకు కుటుంబం ఉండదా?. పోలీసులకు పిల్లలు ఉండరా?. పోలీసులకు కుటుంబంతో గడపాలని ఉండదా? ఉంటుంది..కాని పోలీస్‌ రూల్స్‌ ఒప్పుకోవు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే వైఎస్‌ జగ్‌మోహన్ రెడ్డి రూల్స్ మార్చేశారు. పని ఒత్తిడిలో చాలా మంది గన్స్‌తో కాల్చుకుని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ రక్తచరిత్రను వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మార్చారు. అధికారంలోకి రాగానే పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రకటించి పోలీసుల కుటుంబాల్లో చిరు నవ్వులు చిందేలా చేశారు. అంతేకాదు..ఖాళీలు లేకుండా పోలీస్‌ రిక్రూట్‌మెంట్ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోలీసుల హృదయాల్లో చిరస్థాయిగా సీఎం వైఎస్‌ జగన్‌ నిలిచిపోయారు. పోలీస్‌ల వీక్లీ ఆఫ్‌లపై యూపీ ప్రభుత్వం ఏపీ పోలీసు అధికారులను అడిగి వివరాలు తీసుకుంది . ఏపీ డీజీపీ సవాంగ్ సీడీ రూపంలో యూపీకి వివరాలు అందజేశారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది.

‘స్పందన’పై ఆరా తీసిన పీఎం మోదీ…!

గుజరాత్ రాష్ట్రంలోని వడొదర. పీఎం మోదీ పర్యటిస్తున్నారు. వడొదరలో పోలీస్‌ టెక్నికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల స్టాల్స్‌ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు. పీఎం మోదీ అన్ని స్టాల్స్‌ చూసుకుంటూ వస్తున్నారు. ఏపీ స్టాల్ దగ్గరకు వచ్చేసరికి పీఎం మోదీ ఆగిపోయారు. 10 నిమిషాల పాటు ఏపీ పోలీస్‌ అధికారులతో చర్చించారు. ‘స్పందన’ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రజల నుంచి వినతలు స్వీకరించడం, పరిష్కరించడం వంటి వాటి గురించి తెలుసుకున్నారు. ‘స్పందన’ను ప్రశంసించారు. పని తీరుపై పూర్తిస్థాయి నివేదికను పీఎంఓలో అందజేయాలని..వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఐపీఎస్‌ పాల్‌ రాజ్ టీమ్‌ను మోదీ ఆదేశించారు. ఇప్పుడు ‘స్పందన’ కార్యక్రమం దేశంలోని అన్ని పీఎస్‌ల్లో అమలు చేసేలా పీఎంఓ కసరత్తులు చేస్తుందని సమాచారం.

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి శభాష్ అనిపించుకున్న సీఎం వైఎస్‌ జగన్‌..!

పాదయాత్రలో, మేనిఫెస్ట్‌లో ఇచ్చిన మాట ప్రకారం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. అతి పెద్ద రవాణా సంస్థ. అప్పుల్లో ఉంది. 50వేల మందికిపైగా కార్మికులు. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కాని..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం సాహసోపేతంగా ఆలోచించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 50వేల మందికిపైగా కార్మికులు జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రజారవాణసంస్థను మూసేస్తున్న అనేక రాష్ట్రాలకు పాఠంలా నిలిచారు సీఎం వైఎస్‌ జగన్‌. ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రం ధనవంతమైనది. టీఎస్‌ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు 60 రోజులకుపైగా సమ్మె చేశారు. అయినా..తెలంగాణ ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పింది. ఆర్ధిక స్థితులు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం సాహసోపేతంగా ముందడుగు వేశారు.

‘అమ్మ ఒడి’ పథకంతో చిన్నారుకు మేనమామ అయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌..!

నా దృష్టిలో ‘అమ్మ ఒడి’ పథకం చారిత్రక అవసరం. కూలీ పనులుకు వెళ్లే చిన్నారులను బడి బాట పట్టించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ‘ఓదార్సు’ యాత్ర సాగే సమయంలోనే వైఎస్‌ జగన్‌ తన మనసులో ఈ పథకానికి రూపకల్పన చేసుకున్నారు. పాదయాత్ర సమయంలో గ్రామీణ మహిళలకు అర్ధమయ్యేలా ‘అమ్మ ఒడి’పథకం గొప్పతనం, ఆ పథకం తెచ్చే మార్పులు గురించి వైఎస్‌ జగన్‌ చెప్పేవారు. 10 మంది మహిళలు కనిపిస్తే చాలు ‘అమ్మ ఒడి’పథకం గురించి చెప్పేవారు. పిల్లలు వెళ్లాల్సింది పనులకు కాదు బడులకు అని తల్లులకు వివరించి చెప్పేవారు. జర్మన్‌ నోబెల్ గ్రహీత కూడా ఈ మధ్య ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రశంసించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు ‘అమ్మ ఒడి’ పథకం మార్పు పలకబోతుందని చెప్పారు. ఇండియాలోని మిగిలిన రాష్ట్రాలు కూడా ‘అమ్మ ఒడి’పథకాన్ని అమలు చేయాలని సూచించారు నోబెల్ గ్రహీత. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా తల్లుల అకౌంట్లో వేశారు. ‘జగనన్న గోరుముద్ద ‘ పథకంతో విద్యార్ధులకు పోషకాహారం అందిస్తున్నారు. విద్యార్దులు ఏకాగ్రతతో చదువుకోవాలంటే మంచి బలమైన ఆహారం అవసరమని వైఎస్ జగన్‌ గుర్తించారు. ఫిబ్రవరి 24న విజయనగరం జిల్లాలో ‘వసతి దీవెన’పథకాన్నీ సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభిస్తున్నారు. దీంతో ..లాడ్జింగ్, బోర్గింగ్ ఖర్చులకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లైంది. ఇక..వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధులకు స్కూల్ యూనిఫామ్స్‌, బూట్లు, సాక్స్‌లు, పుస్తకాలు అందించనున్నారు. ఇలా విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయి సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెరలేపారు.

ఇంటికే పింఛన్‌ – వైఎస్‌ జగన్ ఘనత

చెప్పడంటే – చేస్తాడంతే. లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించినప్పుడు దేనికి ఈ రూ.5వేల జీతగాళ్లు?. గోనె సంచులు మోయడానికా అని చంద్రబాబు కామెంట్ చేశారు. మగాళ్లు లేనప్పుడు తలుపులు కొడతారని అసభ్యకరంగా మాట్లాడారు. గ్రామసచివాలయాలపై కామెంట్లు చేశారు. ఇప్పుడు గ్రామసచివాలయాలు ఏపీకి వెన్నుముక అవుతున్నాయి. గ్రామ వాలంటీర్లు తమకు అప్పగించిన పనిని సమర్ధవంతంగా చేస్తున్నారు. ఇంటికి పింఛన్లు ఇచ్చిన రోజున వృద్దుల్లో ఆనందం చూస్తే నాకు అమితానందం కలిగింది. నా దృష్టిలో పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే. ఇప్పటి వరకు ప్రజల దగ్గరకు పాలన అని వినడమే కాని..ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. పింఛన్లే కాదు రేషన్, మెడికల్ కిట్ కూడా ఇంటికే వెళ్లనుంది. వృద్దులకు వైద్య పరీక్షలు ఇంటి దగ్గరే జరగనున్నాయి. ప్రతి పథకం ప్రతి గడప తొక్కాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్ అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంటికే పింఛన్లు దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిన పరిస్థితి.

ఇవన్నీ కూడా విజన్ ఉన్న నేతే చేయగలరు. ఏపీలో అత్యంత వెనకబడిన ప్రాంతం అనంతపురం జిల్లా. ఈ జిల్లాలోని ఓ గ్రామంలోని ఓ పాఠశాలలో ఏసీ, స్క్రీన్‌ , టేబుళ్లు, బెంచీలు కార్పొరేట్ స్కూళ్ల ఏర్పాటు చేశారు. మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దాలనేది వైఎస్‌ జగన్‌ లక్ష్యం. ఇవేవీ చంద్రబాబుకు కనిపించవు. ఎల్లో మీడియా కెమెరాలు గంతలు కట్టకుని తిరుగుతుంటే..ఎల్లో మీడియా కలాలు కులాల లోగోలు వేసుకుని జర్నలిజం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 9 నెలలకే దేశంలో మంచి పాలకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు. మంచి విజన్‌తో పారదర్శకంగా ముందుకు వెళ్తున్నారు. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టే పథకాలు రానున్న రోజుల్లో భారతదేశంలోని పాలకులే కాదు..ప్రపంచంలోని పాలకులు కూడా వచ్చి తెలుసుకుని, పరిశీలించి, వారి దగ్గర అమలు చేస్తారనడంలో సందేహం లేదు. విజన్ అంటే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి, విజన్ అంటే ఎల్లో మీడియాతో డప్పు కొట్టించుకోవడం కాదు…!.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading