టెన్త్ తర్వాత? పాలిటెక్నిక్ కోర్సులు
పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి. ర్యాంకు సాధించి పాలిటెక్నిక్ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు. ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. ప్రవేశ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రన్స్‌ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక కెరియర్‌కు మేలైన బాట వేసుకోవచ్చు!
*హైస్కూలు స్థాయి నుంచే నేటితరానికి కెరియర్‌పై కచ్చితమైన ప్రణాళికలు ఉంటున్నాయి. టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం, వేగంగా స్థిరపడటం లక్ష్యంగా సాగుతున్నారు. అందుకే కొత్త రంగాల ఆవిర్భావం, వాటికి సంబంధించి వస్తున్న స్పెషలైజేషన్లు, అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. మూస ధోరణిలో కాకుండా కొత్త దారుల్లో కెరియర్‌ను మలచుకోవాలనుకుంటున్నవారూ ఉన్నారు. వాళ్లు తాము ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి అదనపు అనుభవం సంపాదించుకోవడం, ముందస్తు పరిజ్ఞానాన్ని పెంపొదించుకోవడంపై దృషి పెడుతున్నారు. అలాంటి వారికి అనుకూలమైనవి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు.
పదో తరగతి విద్యార్హతతో ఎన్నో డిప్లొమా/ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. పది తర్వాత అప్లైడ్ సైన్స్/ టెక్నికల్ సబ్జెక్టులను అభ్యసించాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. ఇవి ఉద్యోగాధారిత కోర్సులు. పూర్తిచేయగానే సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగం సాధించుకునే విధంగా సిలబస్ ఉంటుంది. టెక్నికల్ డిప్లొమా ప్రోగ్రాముల్లో ఇంజినీరింగ్ అంశాలుంటాయి. అందుకే వీటిని డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. కొన్నింటికి మూడున్నరేళ్లు. సెమిస్టర్ విధానంలో నిర్వహిస్తారు. కోర్సుల కాలవ్యవధిని బట్టి ఆరు నెలల వరకు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.
కోర్సులు.. ప్రవేశం
మనదేశంలో పాలిటెక్నిక్ కోర్సులకు పరిధి, గిరాకీ ఎక్కువ. ఎన్నో ఉత్తమ కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) ద్వారా వీటిల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు. రెండు రాష్ట్రాల్లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ సంస్థలు ఈ ప్రవేశపరీక్షను విడివిడిగా నిర్వహిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. పదో తరగతి లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సు (సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎన్‌ఐఓఎస్, టీఓఎస్‌ఎస్, ఏపీఓఎస్‌ఎస్ వంటివి) పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
టీఎస్ పాలీసెట్ : పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 150. మేథమేటిక్స్ నుంచి 60, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఒక్కోదాని నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ పదో తరగతి సిలబస్ నుంచే వస్తాయి.
పీజేటీఎస్‌ఏయూ పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కావాలనుకునేవారు బయాలజీతోపాటు మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల ప్రశ్నలనూ రాయాలి. ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులవారికి బయాలజీ ఆప్షనల్. ప్రతి విద్యార్థికీ ప్రవేశం కోసం రెండు వేర్వేరు ర్యాంకులు (పాలిటెక్నిక్, అగ్రికల్చర్ డిప్లొమా) ఇస్తారు.
ఏపీ పాలీసెట్ : వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. మేథమేటిక్స్ నుంచి 60, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు.
ప్రత్యేకత ఏమిటి?
- పాలిటెక్నిక్‌లో ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’పై ప్రధాన దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే సాంకేతికాంశాలను థియరీ విధానంలో బోధించడంతోపాటు ప్రాక్టికల్ పరిజ్ఞానానికీ సమ ప్రాధాన్యం ఇస్తారు.
విద్యాపరమైన పరిజ్ఞానంతోపాటు భావవ్యక్తీకరణ, ప్రసంగ నైపుణ్యాలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, క్రమశిక్షణ, ప్రెజెంటేషన్లపై పట్టు ఏర్పడుతుంది.
ప్రయోగపూర్వక బోధన కారణంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ అలవడుతుంది. దీంతో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగానికి సంసిద్ధులవుతారు.
ఎలా సన్నద్ధమవ్వాలి?
ప్రవేశపరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ దాదాపుగా 9, 10 తరగతుల నుంచే వస్తాయి. ముఖ్యంగా ప్రశ్నలన్నీ మేథ్స్, సైన్స్ సబ్జెక్టులకు చెందినవే. పదో తరగతి తుది పరీక్షల తర్వాతే ఈ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు అప్పటికే సిలబస్ పూర్తి చేసి ఉంటారు. కాబట్టి, ముందుగా ప్రవేశపరీక్ష సిలబస్‌ను సేకరించి పెట్టుకోవాలి. దాని ఆధారంగా సన్నద్ధత ప్రారంభించాలి.
అకడమిక్ పరీక్షల తరహాలో కష్టపడితే చాలదు. తెలివిగా చదవడంపైనా దృష్టిపెట్టాలి. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయని కేవలం ఆ తరహా మెటీరియల్‌పైనే ఆధారపడకూడదు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం మేలు. కాన్సెప్టులు నేర్చుకుంటే ప్రశ్న ఏవిధంగా వచ్చినా జవాబు గుర్తించడం సులువవుతుంది. కాబట్టి, సిలబస్‌లోని ప్రతి టాపిక్‌లో ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చదవాలి. ఆపై మాదిరి ప్రశ్నపత్రాలను సాధించడంపై దృష్టిపెట్టాలి. ఎంత ఎక్కువ సాధనచేస్తే అంతమంచిది. గత ప్రశ్నపత్రాలు పాలీసెట్ అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయి.
తెలంగాణలో అగ్రి డిప్లొమాలకూ పాలీసెట్
తెలంగాణలో కొత్తగా పాలీసెట్ ఆధారంగానే అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ), దాని అనుబంధ కళాశాలల్లోని సీట్లను ఇకనుంచి పాలీసెట్ ప్రాతిపదికగా కేటాయిస్తారు. ఈమేరకు పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పాత పద్ధతినే పాటిస్తోంది. పాలిటెక్నిక్ ర్యాంకును అనుసరించి యథావిధిగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇస్తారు. అగ్రికల్చర్ డిప్లొమా సీట్లను మాత్రం విడిగా మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
తెలంగాణ: ఆన్‌లైన్‌లో (www.polycetts.nic.in) లేదా తమకు దగ్గర్లోని టీఎస్ ఆన్‌లైన్/ హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్‌టీ వారికి రూ.250.
అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2020
పరీక్ష తేదీ : ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్: ఆన్‌లైన్‌లో (https://polycetap.nic.in) లేదా ఆన్‌లైన్/ హెల్ప్‌లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు రూ.400.
దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 21, 2020.
పరీక్ష తేదీ : ఏప్రిల్ 28, 2020 (ఉదయం 11గం. నుంచి మధ్యాహ్నం 01:00 గం. వరకు)
పీజీ ప్రోగ్రామ్‌ల్లోకి సంస్కృత వర్సిటీ ఆహ్వానం
సంస్కృత భాష అభివృద్ధికి దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సంస్థల్లో శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీ ఒకటి. ఆ కృషిలో భాగంగా ఆ భాషకు సంబంధించిన వివిధ విభాగాలకు పీజీ కోర్సులను నిర్వహిస్తోంది. వాటితోపాటు ఇతర ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకూ ప్రస్తుతం ప్రకటన వెలువడింది.
సంస్కృత భాషతోపాటు ఇతర భాషలనూ, సోషల్‌సైన్సెస్, ఫైన్ ఆర్ట్స్ విభాగాలనూ అభివృద్ధి చేసే లక్ష్యంతో శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీని కేరళలో ఎర్నాకుళం జిల్లాలోని కాలాడిలో ఏర్పాటు చేశారు. ఎనిమిది క్యాంపస్‌లతో ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించిన ఈ యూనివర్సిటీ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తగిన విద్యార్హతలు ఉన్నవారు ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు.
ఏయే కోర్సులు?
ఎంఏ : సంస్కృత సాహిత్య, సంస్కృత వేదాంత, సంస్కృత వ్యాకరణ, సంస్కృత న్యాయ, సంస్కృత జనరల్, వేదిక్ స్టడీస్ అండ్ సోషియాలజీ, ఫిలాసఫీ, మ్యూజిక్, భరతనాట్యం, మోహినీయాట్టం, థియేటర్ తదితరాలు.
ఎంఎస్‌సీ : సైకాలజీ అండ్ జాగ్రఫీ; మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ), మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (విజువల్ ఆర్ట్స్), పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ అండ్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఇన్ హిందీ.
అర్హతలు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో చేరడానికి 10+2+3 పద్ధతిలో ఏదైనా డిగ్రీ రెగ్యులర్ లేదా దూరవిద్యలో పూర్తిచేసిన వారు అర్హులు. చివరి సంవత్సరం చదువుతూ ఏప్రిల్, 2020లో పరీక్ష రాయబోతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎఫ్‌ఏకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీని 55 శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ అండ్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఇన్ హిందీ కోర్సులో చేరడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ వెల్‌నెస్ అండ్ స్పా మేనేజ్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకోవాలంటే బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) డిగ్రీని పొంది ఉండాలి.
దరఖాస్తు ఎలా?
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంఏ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులకు రూ. 150, ఎంఎఫ్‌ఏ, ఎంఎస్‌డబ్ల్యూలకు రూ. 300 ఫీజు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ కోర్సులకు అప్లై చేయాలంటే వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఫీజు కట్టాలి.
ఎంపిక విధానం
వివిధ కోర్సుల్లోకి అడ్మిషన్ కోరుతున్న అర్హులైన అభ్యర్థులందరూ ఎంట్రన్స్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. ఒక క్యాంపస్‌లో కనీసం అయిదు అడ్మిషన్లు ఉంటేనే సంస్కృతంలో పీజీ కోర్సులు, పదిమందికి తగ్గకుండా చేరితేనే సంస్కృతేతర పీజీ కోర్సులను నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ మంది చేరితే దగ్గర్లోని మరో క్యాంపస్‌ను వారికి కేటాయిస్తారు. ప్రతి కోర్సుకీ ప్రత్యేక ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
పీజీ ప్రోగ్రామ్‌లకు ప్రవేశపరీక్షను వాటిని అందిస్తున్న క్యాంపస్‌ల్లోనే నిర్వహిస్తారు. పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ అండ్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఇన్ హిందీ కోర్సుకు ప్రవేశపరీక్షను కాలాడి, ఎట్టుమనూర్ (కొట్టాయం జిల్లా)ల్లో జరుపుతారు. పీజీ డిప్లొమా ఇన్ వెల్‌నెస్ అండ్ స్పా మేనేజ్‌మెంట్‌కు పరీక్ష ఎట్టుమనూర్‌లో మాత్రమే ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 3, 2020.
దరఖాస్తుల ప్రింట్ కాపీని పంపడానికి చివరి తేదీ : ఏప్రిల్ 13, 2020.
వెబ్‌సైట్: www.ssus.ac.in/www.ssusonline.org
[9:22 AM, 4/1/2020] +91 94936 84452: నెట్‌లో పట్టండి.. మార్కులు!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (నెట్) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో స్టైపెండ్‌తో కూడిన పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకూ పోటీ పడవచ్చు. వంద సబ్జెక్టులు, విభాగాల నుంచి 81 పరీక్షలను నిర్వహిస్తున్నారు. పీజీ పూర్తిచేసుకున్నవారూ, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారూ ఈ పరీక్ష రాసుకోవడానికి అర్హులు.
యూజీసీ నెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పేపర్-1 వంద మార్కులకు, పేపర్-2 రెండు వందల మార్కులకు ఉంటాయి. పేపర్-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పేపర్ -2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్ 1, 2 మధ్య ఎలాంటి విరామం ఉండదు.
ఏ అంశాలు.. ఎలా చదవాలి?
పేపర్ -1: ఇందులో 10 విభాగాలుంటాయి. వీటిలో ఒక్కో విభాగం నుంచి కనీసం 5 ప్రశ్నలు రావచ్చు. అభ్యర్థిలోని టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్‌లను పరిశీలిస్తారు. రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేస్తే ఈ పేపర్‌పై అవగాహన వస్తుంది. ఈ విభాగంలో ఎక్కువ మార్కుల కోసం మార్కెట్‌లో దొరికేవాటిలో మంచి పుస్తకాన్ని ఎంచుకుని, చదువుకుంటే సరిపోతుంది.
పేపర్-2: ఇందులో మొత్తం సబ్జెక్టు ప్రశ్నలే ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించే విధంగా ప్రశ్నలు వస్తాయి.
ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్నప్పటికీ ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివినవారే సమాధానాలు గుర్తించగలుగుతారు. కొత్తగా సన్నద్ధమవుతున్నవారు ముందుగా సంబంధిత సబ్జెక్టులో అండర్‌గ్రాడ్యుయేట్ పుస్తకాలు బాగా చదవాలి. ఆ తర్వాత పీజీ పుస్తకాలను సిలబస్ ప్రకారం అధ్యయనం చేయాలి. చాప్టర్లు లేదా టాపిక్ వారీ చదివేటప్పుడు రిఫరెన్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. పాత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. గతంలో అడిగిన ప్రశ్నలు మళ్లీ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ వీటిని పరిశీలిస్తే ప్రశ్నల స్వభావం, వాటిని అడిగే విధానంపై అవగాహన వస్తుంది. సంబంధిత సబ్జెక్టుల్లో నిర్వహించిన జేఎల్, డీఎల్ ప్రశ్నపత్రాలు చూస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. పరీక్ష తేదీ నాటికి కనీసం పది మాక్ టెస్టులు రాయడం మంచిది.
అర్హత పొందితే…!
జాతీయ అర్హత పరీక్ష (నెట్) లో నెగ్గితే దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో అసిన్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్ అర్హులు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్‌డీ) చేయవచ్చు. వీరికి మొదటి రెండేళ్లు ప్రతి నెలా రూ.31,000; అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్ అందుతుంది. సంబంధిత సంస్థ వసతి కల్పించకపోతే స్టైపెండ్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ రూపంలో చెల్లిస్తారు. ఏటా కంటింజెన్సీ గ్రాంటు ఇస్తారు ఇటీవల కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్ స్కోర్‌తో మేనేజ్‌మెంట్ ట్రెయినీ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలను ఇస్తున్నాయి. ప్రైవేటు సంస్థలూ నెట్ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
విద్యార్హత : సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు సరిపోతాయి. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు : జేఆర్‌ఎఫ్ కోసం జూన్ 1, 2020 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ దరఖాస్తులకు వయసు పరిమితి నిబంధన లేదు.
వెబ్‌సైట్ : https://ugcnet.nta.nic.in
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు : ఏప్రిల్ 16 వరకు స్వీకరిస్తారు
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ జండర్లకు రూ.250.
పరీక్షలు: జూన్ 15 నుంచి 20 వరకు నిర్వహిస్తారు.
ఓఎన్‌జీసీ ఉద్యోగాలు
ఓఎన్‌జీసీ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిని సంబంధిత సబ్జెక్టుల్లో నెట్-2020 జూన్ స్కోర్‌తో భర్తీ చేస్తారు. నెట్ ఫలితాలు వెలువడిన తర్వాత వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఓఎన్‌జీసీ వెబ్‌సైట్ www.ongcindia.com కెరియర్ విభాగాన్ని చూడవచ్చు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.