ఇష్టమైన రంగాన్నే ఎంచుకోండిఇష్టమైన రంగాన్నే ఎంచుకోండి

Spread the love

*ఇష్టమైన రంగాన్నే ఎంచుకోండి* *దేన్నైనా మార్చగలిగే అవకాశం మీ ముందుంది* *2020 పట్టభద్రులకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సందేశం* దిల్లీ: ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగించుకొని బయటకు వస్తున్న పట్టభద్రులకు కళ్ల ముందంతా అంధకారమే గోచరిస్తోంది. కరోనా విలయతాండవంతో ఉద్యోగావకాశాలు కుంచించుకుపోవడంతో నిస్తేజం అలుముకుంది. ఇలాంటి సమయంలో 2020 స్నాతకోత్సవ వేళ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ విలువైన సందేశాన్ని వినిపించి భవిష్యత్తుపై భరోసా నింపారు. యూట్యూబ్‌ద్వారా నిర్వహించిన వర్చువల్‌ స్నాతకోత్సవంలో పిచాయ్‌ పంచుకున్న విషయాలివీ.. *2020 అలా గుర్తుంటుంది* మీరు సముపార్జించిన జ్ఞానంతో సంబరాలు చేసుకోవాల్సిన ఈ వేళ, కోల్పోయిన మీ భవిష్య ప్రణాళికలను గుర్తు చేసుకుంటూ మీరు దుఃఖిస్తూ ఉండొచ్చు. అయినా మీరు ఎలాంటి పరిస్థితులనైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. విశ్వాసాన్ని ప్రోది చేసుకోండి. అలా ఉండగలిగితే 2020 పట్టభద్రుల బ్యాచ్‌ని మీరు కోల్పోయిన విషయాలతో కాకుండా, సాధించిన మార్పులతో చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. దేన్నైనా మార్చగలిగే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. *ఇలాంటి సవాళ్లు కొత్త కాదు* గతంలోనూ పట్టభద్రులకు ఇలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. 1920లో ప్రాణాంతక మహమ్మారి, 1970లో వియత్నాం యుద్ధం, 2001లో అమెరికాలో 9/11 ఉగ్రదాడులు.. ఇలా అన్ని దుర్భర పరిస్థితులనూ అప్పటి పట్టభద్రులు జయించగలిగారు. అన్ని వేళలా విశ్వాసాన్ని కలిగి ఉండమని చర్రిత మనకు బోధిస్తుంది. *అసహనమే విప్లవాన్ని సృష్టిస్తుంది* సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వనరుల విషయంలో మీరు అసహనంతో ఉండొచ్చు. దాన్ని కోల్పోవద్దు. అదే సరికొత్త సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఏ రంగంలో మీకు అత్యంత ఆసక్తి ఉందో తెలుసుకోవడానికి తగినంత సమయం తీసుకొని నిర్ణయించుకోండి.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading