*ఇంజనీరింగ్ కు తగ్గి, అగ్రికల్చర్ కు పెరిగిన టీఎస్ ఎంసెట్ దరఖాస్తులు!* హైదరాబాద్: ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల గడువు ముగిసింది. ఆలస్య రుసుము లేకుంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు జూన్ 10 (బుధవారం)తో ముగిసింది. ఇకపై ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరించేందుకు సెట్ కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ఎంసెట్ ప్రిపరేషన్ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, గెడైన్స్.. ఇతర అప్డేట్స్ కొరకు క్లిక్ చేయండి. గతేడాదితో పోల్చితే ఈసారి అదనంగా 2,211 మంది విద్యార్థులు ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది మొత్తంగా 2,17,199 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి 2,19,410 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ వెల్లడించారు. ఇంజనీరింగ్ ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గతేడాది కంటే తగ్గిపోగా, అగ్రికల్చర్ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. గతేగాది ఇంజనీరింగ్ కోసం 1,42,210 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి 1,41,468 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ కోసం గతేడాది 74,989 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 77,942 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.