పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు

Spread the love

వైసిపీ ప్రభుత్వ నిర్ణయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా స్వాగతీస్తూ వస్తున్నారు. మొన్న గుంటూరు భూముల అంశంలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. తాజాగా పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. కరోని క్లిష్ట సమయంలో వైసీపి ప్రభుత్వం ఉత్తమమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు.
పరీక్షలు రద్దు సముచిత నిర్ణయం.. వైసీపి ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్..

కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లితండ్రుల పక్షాన జనసేన చేసిన విజ్ఞప్తిని గౌరవించి పరీక్షలను రద్దు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

సరైన సమయంలో సముచిత నిర్ణయమని, వీటితోపాటు ఇంటర్మీడియట్ ముందస్తుగా నిర్వహించే అడ్వాన్స్ సప్లిమెంటరీ రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయమని గబ్బర్ సింగ్ అభిర్ణించారు.

గతంలో పరీక్షల రద్దుకు పట్టుబట్టిన జనసేనాని..

విద్యార్థులు సమాహాలుగా చేరితే ఎవరిది బాద్యత.? గతంలో పరీక్షల రద్దుకు పట్టుబట్టిన జనసేనాని..
కరోనా విస్తృతి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్రతిఒక్కరికీ తెలిసిందేనని, కరోనా నివారణలో ఏ విధంగా వ్యవహరించామో మనందరికీ తెలిసిన అంశమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో రోజూ వందలాది కొత్త కేసులు నమోదు అవుతున్న విషయం ఆందోళనకరంగా మరిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేసారు. ఈ తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకోవడం ఘోర తప్పిదం అవుతుందని పవన్ విశ్లేషిస్తున్నారు.

రాష్ట్ర పరిస్ధితి బాగాలేదు.. అడ్వాన్స్ పరీక్షలను కూడా రద్దు చేయాలన్న పవన్..

ఇదిలా ఉండగా కరోనా వికటాట్టహాసం చేస్తున్న తరుణంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తేనే శ్రేయస్కరమని విద్యార్థుల తల్లిదండ్రులు భావించారని పవన్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రయాసతో కూడిన పనితో పాటు, పరీక్షా కేంద్రాలలోకి వెళ్లే సమయంలోను, తిరిగి బయటకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించడం అసాధ్యమైన చర్యలుగా పవన్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. పిల్లలంతా గుంపులు గుంపులుగా లోనికి వెళ్తారు, వస్తారని దీన్ని నివారించడం కష్టంతో కూడుకున్న పనని పవన్ అన్నారు.

విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించాం.. అందుకే పరీక్షల రద్దుకు డిమాండ్ చేసామన్న గబ్బర్ సింగ్..

విద్యార్థులు సమూహాలుగా ఏర్పడడం ఎంతో ప్రమాదకరమని, ఇదే అంశం పట్ల నిపుణులు, విద్యావేత్తలతో విస్తృతంగా మాట్లాడడంతో పాటు పొరుగు రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలను అధ్యయనం చేసిన తరువాతే పదో తరగతి పరీక్షలను రద్దు చేయవలసిందిగా జనసేన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని తెలిపారు. లక్షలాది మంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టవద్దని జనసేన ప్రభుత్వాన్ని వేడుకుందని, ఈ విషయంలో సహేతుకంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, రద్దు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ వినమ్రంగా పేర్కొన్నరు.

source: oneindia.com


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading