🍁ప్రేమ…🍁

Spread the love

🍁ప్రేమ…🍁

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు.

గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు.

మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.

గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.

చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.

ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.

టోపి కాస్తా నదిలో పడింది.

దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.

అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.

అయ్యో పాపం అని బాధపడ్డారు. “నీకివాల ఉపవాసమే” అన్నాడొకడు.

పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకొకడు.

“నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు “అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.

బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.

వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.

వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా.

వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.

వేటగాడు : “గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా “అన్నాడు.

భార్య : “మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు”

వేటగాడు : “ఆవు కూడా గాడిదకు మారకం వేశా”

భార్య : “కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే” అంది తృప్తిగా.

వేటగాడు : “గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా”

భార్య : “అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా”

వేటగాడు : “అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా”

భార్య : “సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు”

వేటగాడు : “కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది”

భార్య : “పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ” అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది. 🍁

👉గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

👉ఇదే నిజమైన ప్రేమ..

👉ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.


🌿మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంభాషణ వినగలమా!

👉👉కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి చివరకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే.

🌿అందుకే, ఏ ఒక్కరిని తొందరపడి ఏం అనకండి. కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది.

🌿మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది.

🌿ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.

👉ప్రతికూల సందర్భంలో కూడా సానుకూల దృక్పథంతో ఉండేందుకు ప్రయత్నిద్దాం.🍁


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading