ఢిల్లీ నగరం లోని హడ్సన్ లేన్‌లో ఉన్న కేఫ్ హౌస్ ఫుల్ అనే కేఫ్ వారు సరి కొత్తగా మ్యాగీ నూడుల్స్ ను బీర్‌తో కలిపి సర్వ్ చేస్తున్నారు. దీంతో బీర్ మ్యాగీ అనే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే బీర్ మ్యాగీ నూడుల్స్ ను తినాలని ఉందని కొందరు అంటుంటే, మరి కొందరేమో అదేం టేస్టు, బీర్‌తో కలిపి మ్యాగీ నూడుల్స్ ను అసలు ఎవరైనా తింటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు బీర్‌ను, మ్యాగీ నూడుల్స్ ను కలిపి ఎలా వండారు అనే సందేహాలు కలుగుతున్నాయి ఇంకొంత మందికి. కొందరేమో వాటిని కేవలం బీర్‌లో నానబెట్టి సర్వ్ చేస్తున్నారని అంటున్నారు. లేదు నూడుల్స్ ను బీర్‌లో కలిపి వండి ఇస్తున్నారని మరి కొందరు అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా ఈ బీర్ నూడుల్స్ మాత్రం చూడటానికి చాలా వెరైటీగా ఉన్నాయి. మరి వాటి టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూడాలి.
https://www.instagram.com/p/CI7tc9AnwXr/?utm_source=ig_web_copy_link