యువ కధనాయకుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ‘ ఎబిసిడి ‘ . సురేష్ ప్రొడక్షన్ అధినేత డి. సురేష్ బాబు సమర్పణ లో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ సినిమాస్ పథకాల పై తెరకెక్కిన చిత్రం ” ఎబిసిడి ” . సంజీవ్ రెడ్డి దర్శకుడి గా పరిచయమైన ఈ సినిమాను శ్రీధర్ రెడ్డి ,యాష్ రంగినేని నిర్మించారు. మే 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఐనది. సినిమా సక్సెస్ ను యూనిట్ సెలెబ్రెట్ చేసుకున్నారు.కేక్ కట్ చేశారు.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ” నేడు సినిమా విడుదలైంది. మార్నింగ్ బలమైన ఓపెనింగ్స్ తో నే సినిమా స్టార్ట్ ఐనదిఈవెనింగ్ షో తర్వాత సెలబ్రేట్ చేసుకోవలనుకున్నాం. తండ్రి , కొడుకుల మధ్య ఎమోషన్ ని కరెక్ట్ గా సెట్ చేయాలి అనుకున్నామో అది ఏ రోజు నెరవేరింది.అల్లు శిరీష్ కొత్త స్టార్ గా మారాడని అందరూ అంటున్నారు. తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తనలో హ్యాపీనెస్ చూడాలి అనుకున్నా. అది ఈ రోజు నెరవేరింది.
హీరో , హీరోయిన్ మధ్య లవ్ లవ్ స్టోరి భరత్ కామెడీ , వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ అయ్యాయి అని అంటున్నారు. 68% ఓపెనింగ్ ఐనా ఈ సినిమా, 74% మ్యాట్నీ కి పెరిగింది, సాయంత్రం అది 78% పెరిగింది. ఓ నిర్మాతగా చాలా సంతోషం గా ఉంది. మా శిరీష్ బెస్ట్ మూవీ ని ఈ వీకెండ్ లో దాటలని కోరుకుంటున్నాను. దాటుతమని నమ్మకం గా ఉంది. త్వరలో నే పెద్ద సక్సెస్ మీట్ ను కుడా పెడుతున్నాం.