బిగ్ బాస్ 3 త్వరలో స్టార్ట్ అవబోతుంది.ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణ గా కే.ఏ. పాల్ ఇంకా హాట్ శ్రీ రెడ్డి మెరవబోతున్నారట.
వాళ్ళతో పాటు మరికొందరు స్టార్స్‌ను ఈ సారి ఇంట్లోకి పంపించాలని చూస్తున్నారు. 🎊బిగ్ బాస్ షో: ఇప్పటికే బిగ్ బాస్ 1,2 సీజన్స్ పూర్తైపోయాయి. 🔴బిగ్ బాస్ తొలి సీజన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో బ్లాక్ బస్టర్ అయింది. 🔴 రెండో సీజన్ నాని చేతుల్లో సో..సో.గా మాత్రమే ఆకర్షించింది. రెండో సీజన్ యావరేజ్ కావడంతో మూడో సీజన్ కోసం స్టార్ హీరోను చూస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ఎలాగైనా ఈ జూన్, జులైలో మూడో సీజన్ మొదలు పెట్టాలని చూస్తుంది మా యాజమాన్యం. ఈ సీజన్ కోసం ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్న నిర్వాహకులు.. చివరికి నాగార్జునకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
దాంతో తెలుగులో కూడా వీలైనంత త్వరగా సీజన్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నానితో పాటు వెంకటేష్ కూడా మూడో సీజన్ హోస్ట్ లిస్టులో ఉన్నాడు. కానీ ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. చివరికి నాగార్జున ఈ సీజన్ టేకోవర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం నాగ్ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకుని జులై లేదంటే సెప్టెంబర్ నుంచి మూడో సీజన్ పట్టాలెక్కించాలని చూస్తున్నారు.
🔴 కేఏ పాల్ &శ్రీ రెడ్డి :
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే హౌజ్ మేట్స్ గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్దరు సంచలన తారల పేర్లు మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తెలుగు రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ కామెడీ స్టార్ కేఏ పాల్‌తో పాటు శ్రీ రెడ్డి కూడా ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 👉ఇంకొక వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ షో కంటెస్టెంట్ అట. వాళ్ళ ముగ్గురి తో నాగార్జున కనిపిస్తూఉంటే తొలి రెండు సీజన్స్ కంటే కూడా మూడో సీజన్ మరింత హైలైట్ కావడం ఖాయం. మరి చూడాలిక.. ఎంత సెన్సేషన్ అవ్వబోతుందో..