వరుస ఫ్లాప్‌లతో చేతిలో సినిమాలు లేకుండా ఉన్న దర్శకుడు వి వి వినాయక్‌కు మెగా పిలుపు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ రైట్స్ తీసుకున్న రాంచరణ్. వి వి వినాయక్‌తో సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. సుకుమార్ లూసిఫర్‌ను తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌కు తగ్గట్లుగా మల్చినట్లు తెలుస్తోంది. కథపై మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ సంతృప్తి వ్యక్తం చేయటంతో దర్శకున్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు ఎన్‌విఆర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.
వి వి వినాయక్‌తో పాటు వంశీ పైడిపల్లి, శ్రీను వైట్ల పేర్లను పరిగణలోకి తీసుకున్న చిరంజీవి. చివరకు వినాయక్‌తో మూవీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారని, అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.