దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో సాయంత్రం 6.30 గంటలకు 55.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధి షెఫాలి శరణ్ వెల్లడించారు.
కాగా పోలింగ్ సరళి ఆధారంగా వివిధ సంస్థలు ఫలితాలను అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.
70 సీట్ల దిల్లీ అసెంబ్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఆ లెక్కన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీయే(ఆప్) మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని సూచిస్తున్నాయి. ప్రధాన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆప్‌కు 50 సీట్ల కన్నా ఎక్కువే వచ్చే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి.
ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 11న ఓట్లు లెక్కించి అసలు ఫలితాలు ప్రకటించనుంది.
ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎలా ఉంది?