జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?

jagan
Spread the love

జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?

1. చదువుల మాఫియా:
బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ చైతన్య లకు అప్పజెప్పాడు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా అయనకు శత్రువు లే. ఐబీ syllabus లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే మండదా వాళ్లకు.

2. ఆరోగ్య మాఫియా:
బాబు తన 14 యేండ్ల పాలన లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టలేదు. ఒక్క ప్రభుత్వ వైద్యశాల కట్టలేదు. మరి ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్న కొంత మందికి, అలాగే కులపోల్లు నడుపుతున్న కార్పొరేట్ ఆసుపత్రులకు నష్టం కదా. వాళ్లకు ఆయన శత్రువే మరి. ఒకేసారి రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు కట్టాడు కదా. ముందుగానే రోగాలు భారిన పడకుండా preventive care తీసుకోవడం కోసం ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అని మొదలు పెడితే కుల మాఫియా వ్యాపారాలు ఏమ్ కావాలి. 16 హెల్త్ హబ్ లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు కడితే మా ఆదాయాలు ఏమ్ కావాలి.పేదవాడు అయినా ధనవంతుడు అయినా రోగాలు రావాలి ఆసుపత్రికి రావాలి మేము దోపిడీ చెయ్యాలి.
మరి పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా ప్రభుత్వంలోనే కల్పిస్తే మండదా వాళ్లకు?

3. వ్యవసాయం మాఫియా:
కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వాళ్ళ పొట్ట కొట్టాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. అన్ని అక్కడే వాళ్లకు తక్కువ ధరకు ఇస్తున్నాడు. మరి మాకు ఆయన శత్రువు నే కదా.

4. అమరావతి మాఫియా:
పేదల భూములు రైతుల భూములు తక్కువ ధరకే కొట్టేసిన బాబు ఆయన బినామీలకు ఆయన శత్రువే.
మేము ఆ రాజధాని పేరు చెప్పి కోట్లు అక్కడ పెట్టీ లక్షల కోట్లు సంపాదించాలి అని ప్లాన్ చేస్తే అది జరగకుండా చేశాడు. మరి మాకు కడుపు మండదా.

5. అగ్రకులాల అసూయ ద్వేషం:
అవును అందరినీ సమానంగా చూస్తున్నాడు జగన్. అదే బాబు గారి పాలన లో అయితే మా కులపోల్ల పెత్తనం నడిచేది. ఈ రోజు పేదవాడు కూడా బాగుపడ్డాడు. మరి మా పనులు చేసేది ఎవరు.
మేము వాళ్ళు ఒక్కటే నా? వాళ్ళ పిల్లలు అంత చక్కగా మంచి డ్రెస్ వేసుకొని స్కూల్ కి పోతున్నారు, వాళ్లకు పథకాల ద్వారా డబ్బు వస్తుంది. మరి ఇలా అయితే మా కంటే వాళ్ళు కూడా అన్నిట్లో బాగుపడతారు కదా.
కాబట్టి మాకు శత్రువునే

6. మీడియా మాఫియా:
బాబు లాగా జగన్ డబ్బులు ఇచ్చి మీడియా పెద్దలను మేపడు కదా. బాబు అంటే మీడియా డార్లింగ్ అని పేరు. కాబట్టి మేము రోజు విషం కక్కుతాం. మాకు నీ వల్ల ఏమ్ డబ్బు రాదు కదా. కాబట్టి మాకు శత్రువు నే

7. పారిశ్రామిక వేత్తలు: లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాడు. అలా దేశం లో వున్న పెద్ద పెద్ద కంపనీ లు ఇక్కడికి వస్తె మా వ్యాపారాలు ఎలా జరగాలి, మా కులపొల్లు ఎలా బాగుపడాలి. కాబట్టీ అస్సలు ఏమ్ జరగలేదు, కంపనీ లు రాలేదు అని చిన్న చితక పారిశ్రామిక వేత్తలు అని చెప్పుకొనే వాళ్ళతో తిట్టించాలి. కాబట్టి వాళ్లకు, జనాలకు శత్రువు నే.

8. బందువులు: సొంత కుటుంబంలో వున్న వ్యక్తులకు శత్రువు నే. ఎందుకు అంటే అధికారం అడ్డుపెట్టుకుని దోపిడీ చెయ్యాలి, సంపాదించాలి అని అంటే ఒప్పుకోడు కదా.

9. ప్రతి పక్షపార్టీలు: ప్రతి పక్షం వాళ్ళను చావు దెబ్బ కొట్టాడు ఎలక్షన్ లో కొలుకోకుండా. అంత ఓటమి వాళ్ళు జీవితం లో చూడలేదు. కాబట్టి వాళ్లకు శత్రువు నే.

10. ప్రభుత్వ అధికారులు: ఆయనతో పని చేస్తున్న అధికారులకు శత్రువు నే. ఎందుకు అంటే.బాబు హయాంలో విపరీతమైన దోపిడీ వుండేది, లంచాలు వుండేవి. జగన్ వచ్చాక, గ్రామ సచివాలయం, వాలంటీర్ లు పెట్టాక, లంచాలు లేవు. DBT చేస్తున్నాడు, మా పెత్తనం లేకుండా పోయింది. పేదలకు అన్ని ఎవరిని అడగకుండా నే వస్తున్నాయి. ఇది నా తోటి మిత్రులు నాతో స్వయానా అన్నారు. అప్పట్లో లక్షల రూపాయలు నెలకు వచ్చేవి అని. ఇప్పుడు ఆస్కారం లేదు అని ఏడుపు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *