😎👨💻 *లియో… ద రోబో డ్రోన్*🤩 👉 ఎగిరే డ్రోన్స్ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్ వచ్చేసింది. సెంటర్ ఫర్ అటానమస్‌సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (కాస్ట్) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్ పేరు లియోనార్డో… (లెగ్స్ ఆన్‌బోర్డ్ డ్రోన్). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్ తాడుపై నడవడమే కాదు… స్కేటింగ్ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది. ✳️☣️ రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్ మూవ్‌మెంట్ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్ ఆపరేటింగ్ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద నడుస్తూ తమ అవసరాలకనుగుణంగా కదిలే పక్షులే మాకు స్ఫూర్తి. ఎగిరే డ్రోన్లకు కొన్ని పరిమితులున్నాయి. విద్యుత్ వినియోగం ఎక్కువ. కానీ లియో అలా కాదు. ✳️☣️ పరిస్థితులకు అనుగుణంగా దాని మోడ్‌ను మార్చుకుంటుంది. జెట్‌సూట్ వేసుకున్న మనిషి భూమి మీద వాలేప్పుడు, ఎగరడానికి ముందు కాళ్లను నియంత్రించినట్టుగానే ఈ రోబో డ్రోన్ సైతం నియంత్రిస్తుంది. హై వోల్టేజ్ లైన్ల తనిఖీ, అంతరిక్ష కేంద్రంలోని వివిధ భాగాల మరమ్మతుల వంటివి చాలా ప్రమాదంతో కూడుకున్నవి. ✳️☣️ అలాంటి వాటిని సైతం లియో ఒక్కటే చేసేస్తుంది’’అని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సూన్ జో చుంగ్ తెలిపారు. అయితే మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దాని ధర ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇంకా పయ్రోగ స్థాయిలో ఉన్న ఈ రోబో… తయారీ కోసం ఏదైనా కంపెనీ ముందుకొస్తే త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. *📰✒️🇮🇳సత్యమేవ జయతే🇮🇳✒️📰*