జగన్ ను ప్రజలు అఖండ మెజార్టీతో అక్కున చేర్చుకున్నారు. సిఎమ్ ను చేసారు. మరి cm.జగన్ తొలిసారిగా జనాలకు ఇచ్చే కానుక ఏంటి?
👉ఆ విషయం లోకి వెళితే : ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా జిల్లాల పునర్వవస్థీకరణ చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది. అనకాపల్లి లాంటి చోట్ల అయితే క్లియర్ గా జిల్లా కేంద్రం చేస్తారని తెలుస్తుంది
👉కొత్త జిల్లాల ప్రకటన:
జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొత్త జిల్లాల ప్రకటన లేదా జిల్లాల పునర్వవస్థీకరణను ప్రకటిస్తారని, నేరుగా కొత్త జిల్లాలను ప్రకటించడం లేదా, పునర్వవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించడం కానీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్వతీపురం, అరకు (గిరిజన జిల్లా), అనకాపల్లి, తూర్పుగోదావరిలో రాజమండ్రి, పశ్చిమగోదావరిలో భీమవరం లాంటి ఊళ్లు జిల్లా కేంద్రాలుగా మారే అవకాశం వుంటుంది. ఇది మాత్రమే కాకుండా నవరత్నాల అమలుకు కూడా శ్రీకారం చుడతారు.