Teluguwonders:
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన హీరో ప్రిన్స్. ‘నీకు నాకు డాష్ డాష్’ అంటూ తేజ దర్శకత్వంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో ప్రిన్స్. బాస్‌స్టాప్, రొమాన్స్ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లైనా ప్రిన్స్‌కు బాగా గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. రంజుగా సాగిన ‘బిగ్‌బాస్ సీజన్ 1’ లో చివరి వరకూ గట్టిపోటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతోన్న ‘బిగ్ బాస్ 3’ గురించి ప్రస్తావించాడు.
“నేను ‘బిగ్ బాస్’ చేసినప్పటి పరిస్థితులు వేరు..
అక్కడి వాతావరణం వేరు. అందువలన కాస్త భయంతోనే ఆ రోజులు గడిచాయి. ఆ తరువాత నాని హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ 2’ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రస్తుతం జరుగుతోన్న ‘బిగ్ బాస్ 3’ని వీలును బట్టి చూస్తున్నాను.
ఎందుకో ఈ సీజన్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో వుండేవాళ్లల్లో నాకు ‘బాబా మాస్టర్’ వ్యక్తిత్వం నచ్చింది. చివరివరకూ ఆయన నిలబడతాడనిపిస్తుంది. ఇక రేసులో వరుణ్ సందేశ్ .. శ్రీముఖి .. శివజ్యోతి కనిపిస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు.