అవును ఆ అపరిచిత మహిళ ఇంట్లోకి వచ్చి అంట్లు తోమేస్తుంది. మీరు ఆ ప్రాంతం లో ఉంటే ఆవిడ మీ ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది.
🤔👉విషయంలో కి వెళ్తే : హమ్దేన్‌లోని ఓ ఇంట్లోఓ అపరిచిత మహిళ ఎవరి ఇంట్లో బడితే వారింట్లోకి చొరబడి అంట్లు తోమడం, ఇంట్లోవారితో ఇష్టానుసారంగా వ్యవహారించడం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని జైలుకు పంపారు. ఆమెపై దోపిడీ కేసు నమోదు చేశారు. ఇంట్లో ప్రవేశించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండడంతో సమాచారం అందుకున్న వింటన్ కౌంటీ పోలీసులు అక్కడికి చేరుకొని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసులు ఒహియోకు చెందిన చేనేన్ ఎవింగ్‌గా గుర్తించారు.
👉అసలు ఏం జరిగింది : ఆ ఇంట్లో పనిచేసే సహాయకులు చెప్పిన దాని ప్రకారం… మొదట ఆమె ఇంటి బ్యాక్ డోర్ నుంచి లోపలికి ప్రవేశించింది. అనంతరం ఇంట్లోని సోఫాపై కూర్చొని పెంపుడు కుక్కతో ఆడుకోవడం ప్రారంభించింది. దాంతో ఆమెను ప్రశ్నించిన సహాయకులను కాదని కిచెన్‌లోకి దూరి చక్కగా అంట్లు తోముతోందంట. ఆమె ఎవరో తమకు తెలియదని, చాలా వింతగా ప్రవర్తిస్తుందని ఇంట్లోవారు పోలీసుల ముందు వాపోయారు. 👉పోలీసులు ఎవింగ్ ఎవరూ, ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుందో కనుగొనే పనిలో పడ్డారు . ప్రస్తుతానికి ఆమెను అదుపులోకి తీసుకోని జైలుకు పంపారు. కొంతమంది మంచోళ్ళో పిచ్చోళ్ళో అర్థమవదు ఇలాంటి విచిత్ర వ్యక్తులు చాలా చోట్ల ఉంటారు.