జీవితం చెప్పిన పాఠాలు

Spread the love

జీవితం చెప్పిన పాఠాలు !!

జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనకి ఊహించని విధంగా సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో మనతో ఎవరు ఉండరు . ఉంటానన్న వాళ్ళు అసలు ఉండరు . మనతో మనం మాత్రమే ఉంటాము . సమస్యలు వచ్చినంత మాత్రాన భయపడాలిసిన అవసరం లేదు . ఎన్ని సమస్యలు వస్తాయో రానివ్వండి ??
సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కూడా ఉంటుంది. చాలా మంది జీవితంలో ఓడిపోయారని బాధ పడుతుంటారు. నిజానికి వాళ్ళు జీవితంలో ఓడిపోలేదు. సమాజంలో ఎవరిని మోసం చేయలేక ఓడిపోయారు . ఇప్పుడున్న సమాజంలో మీతో మీరే పోరాడాలి . గెలిస్తే మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఓడితే
మళ్ళీ ప్రయత్నించండి .కొన్నిసార్లు మనము అనుకునేది జరగకపోవచ్చు. అలా అని బాధ పడినా…ఏమి ఉపయోగం ఉండదు.
కాలంతో నడుచుకుంటూ వెళ్లిపోవాలిసిందే.
ఏదయినా కష్టంగా ఉంది అనుకుంటే ,
తేలికగా ఉన్నవి కూడా కష్టంగా ఐపోతాయి !!
అలా అనడం మానేసి , కష్టంగా ఉన్నవి
తేలికే అని అనడం నేర్చుకోండి !!


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading