Don’t Feel To Say Sorry
తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటంలో తప్పే లేదు . మీరు తప్పు చేసారని తెలిసిన తరువాత కూడా ఆ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం ఎందుకు సరిపోవడం లేదు . కొన్ని బంధాలు తప్పు అనే పదం దగ్గరే ఆగిపోతాయి . ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంటుంది . తప్పును ఒప్పుకుని క్షమించమని అడగండి . మీ తప్పును క్షమించలేదంటే అక్కడ మీ బంధం అవసరం లేదని అర్థం . చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం ఉంటేనే తప్పు చేయండి . చేసిన తప్పును ఒప్పుకుని , మీ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగే వాళ్ళని ఎప్పటికి వదులుకోకండి . ఎందుకంటే వాళ్ళు , వాళ్ళ కంటే మీ బంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నారని తెలుసుకోండి . కొన్ని బంధాలు అసలు అర్థంకావు . ముందు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం అవుతారు . అర్థం చేసుకునే మనస్సు మనకుంటే అర్థం
కాని వారంటూ ఎవరు ఉండరు అండి . అది మన నుంచే ఉండాలి .