లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంటే నిద్ర లో ఉన్నాడు ఆ వ్యక్తి..

సాధారణంగా అందరూ డబ్బు సంపాదించడం కోసం బాగా కష్టపడుతూ ఉంటాం. అందరికీ డబ్బు అవసరం. కానీ అది సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మార్గంలో వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు . కొంతమంది కష్టపడి సంపాదిస్తే , మరికొంతమంది షార్ట్కట్లో సంపాదిస్తూ ఉంటారు. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని కష్టపడకుండానే డబ్బు రావాలనుకుంటారు మరి కొంత మంది. తీరా లక్కొచ్చి తలుపు తడితే తలుపు తీయకుండా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు 👉యూఏఈలో దాదాపు ఇలానే ఓ సంఘటన జరిగింది.
🎁 వివరాల్లోకి వెళితే : షోజిత్ అనే ఎన్నారై ఏప్రిల్ 1న అబూధాబీ డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ లాటరీని కొనుగోలు చేశాడు. ఒక్క సారైనా తగలకుపోదా తాను కోటీశ్వరుడిని అవ్వకపోనా అనే ఆశతో లాటరీని కొన్నాడు.
🎁లక్కు తలుపు తట్టింది : అయితే ఇటీవల తీసిన డ్రాలో షోజిత్ కొన్న లాటరీకి ఏకంగా 15 మిలియన్ దిర్హామ్‌ల(4 మిలియన్ డాలర్లు = రూ. 27 కోట్ల 65 లక్షలు) ప్రైజ్ తగిలింది.
🔴ఫోన్ కట్ చేస్తున్నాడు తెలియక : లాటరీ అధికారులు ఈ విషయం వెంటనే షోజిత్‌కు తెలపాలని ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఫోన్ చేసిన వెంటనే షోజిత్ కట్ చేస్తున్నాడంట. ఎందుకు కట్ చేస్తున్నాడో తెలీదు కానీ ఇంతవరకు షోజిత్‌కు తాను రూ.27 కోట్లు గెలిచాననే సంగతి కూడా తెలీదు. లాటరీ అధికారులు మాత్రం తమకు షోజిత్ ఇంటి అడ్రస్ కూడా తెలుసని.. ఫోన్‌లో అందుబాటులోకి రాకపోతే ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తామని చెబుతున్నారు. షోజిత్ కి మీరైనా చెప్పండి మరి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
