అందరూ చనిపోయాడనుకున్న.. ఆ కుర్రోణ్ని.. ఒక సెంటు వాసన బ్రతికించింది..

ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని కుంబ్రియా ప్రాంతంలో చోటుచేసుకుంది.. 👉21 రోజులుగా కోమాలోనే ఉన్న ఒక కుర్రోడి లో ఒక సెంట్ కదలిక తెచ్చింది. కోమాలో ఉన్నవాడిని లేచి కుర్చునేలా చేసింది.
🔴విషయం లోకి వెళ్తే :
కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు మూడు వారాల కిందట చలికి గడ్డకట్టి ఉన్న ఈడెన్ నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. సుమారు 25 నిమిషాల తర్వాత అతడిని నది నుంచి వెలికి తీశారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని అంతా భావించారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తూ వైద్యులు అతడి హార్ట్‌బీట్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. దీంతో అతడి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ, అతడిలో మాత్రం కదలిక కనిపించలేదు.
👉ఇక చివరి ఘట్టం :
చివరికి క్రూజ్‌ను ఫ్రీమ్యాన్ హాస్పిటల్‌లోని ఐసీయూలో ఉంచారు. 21 రోజులుగా క్రూజ్ తల్లి వియలెట్టా (43), హాస్పిటల్‌లోని నర్సులు అతడిని కోమా నుంచి బయటకు తీసుకురాడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. క్రూజ్ ఇంట్లో స్నానానికి ఉపయోగించే సోప్స్‌తోపాటు డియోడ్రెంట్ ఇతరాత్ర ఇష్టమైన వస్తువులను తీసుకురావాలని వియలెట్టాకు ఓ నర్సు సూచించింది.
నర్సు సూచనల మేరకు క్రూజ్ శరీరాన్ని శుభ్రం చేసిన తల్లి అతడికి ఇష్టమైన లింక్స్ (Lynx) డియోడ్రెంట్‌ను స్ప్రే చేసింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది.ఆ సెంట్ వాసనకు క్రూజ్ వెంటనే కళ్లు తెరిచాడు.దాంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. 👉ఆ డియోడ్రెంట్ అంటే క్రూజ్‌కు చాలా ఇష్టమని, అదే అతడిలో కదలిక తీసుకువస్తుందని తాము అస్సలు ఊహించలేకపోయామని వియలెట్టా పేర్కొంది. ఇది వైద్య చరిత్ర లొనే చాలా అరుదైన ఘటన అని వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.

Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
