మహేష్ లుంగీ డ్యాన్స్.. కేక పుట్టిస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు నెలరోజులు కూడా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్. ఈ పాటలో మహేష్ లుంగీతో కనిపిస్తాడని.. ఫుల్ మాస్ స్టెప్స్ వేస్తాడని అంటున్నారు.
[the_ad id=”4850″]
ఈ పాటకు నృత్యరీతులను సమకూర్చారని కూడా అన్నారు. తాజాగా ఈ పాట షూటింగ్ సమయంలో తీసిన వీడియో ఒకటి లీక్ అయింది. ఇందులో మహేష్ లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ వీడియో బిట్ బయటకు రావడం ఆలస్యం.. వైరల్ గా మారింది. మోడరన్ డ్రెస్సులో మహేష్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే మహేష్ ఎప్పుడు పంచె లేదా లుంగీ కట్టుకున్నా అదో హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా అభిమానులకు మహేష్ మాస్ ఆవతారం సూపర్ కిక్కిస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది.
మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే డ్యాన్స్ విషయంలో మహేష్ కు మార్కులు తక్కువే పడతాయి. అయితే ఈ సినిమాలో మాత్రం స్టెప్స్ విషయంలో మహేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట. మాస్ ఎంటర్టైనర్ కావడంతో డ్యాన్స్ విషయంలో కూడా ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడట. మరి ఈ లుంగీ డ్యాన్స్ తో మహేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
[the_ad id=”4846″]
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
