ధన్ తేరాస్‌కు ముందు మలబార్ గోల్డ్ బహిష్కరణ పిలుపు..

మలబార్ గోల్డ్ వ్యాపారం సంస్థ యావత్ భారత దేశంలోనూ తన షాప్స్ ని కలిగి ఉంది. కేరళకు చెందిన శ్యామ్లాల్ అహ్మద్ ఈ మలబార్ గోల్డ్ కు యజమాని. ఈ సంస్థ ధన్ తేరస్ ఒక రోజు ముందు.. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోంది. దీని కారణం లండన్ కు చెందిన పాకిస్తానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అలీష్బా ఖలీద్ ని ఆభరణాల ప్రచారానికి ఎన్నుకోవడమే.
దీపావళి పండగ సందడి మొదలైంది. ముఖ్యంగా ధన త్రయోదశి రోజున బంగారం, వెండి లోహాలను కొలుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపధ్యంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి గోల్డ్ షాప్ కస్టమర్స్ ను ఆకర్షించేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ధన్ తేరస్ ఒక రోజు ముందు కేరళకు చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహిష్కరణ పిలుపుని ఎదుర్కొంటుంది.
లండన్ కు చెందిన పాకిస్తానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అలీష్బా ఖలీద్‌తో కలిసి పనిచేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోంది. ఖలీద్ భారతపై వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఫేమస్ అయింది. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కూడా ఎగతాళి చేసింది.
పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారతదేశం ఆధారాలు అందించడంలో విఫలమైందని, ఆపరేషన్ సిందూర్ కింద ఒక మసీదును లక్ష్యంగా చేసుకుందని ఖలీద్ తన సోషల్ మీడియా పోస్ట్‌లలో పేర్కొన్నారు. “నా ఫాలోవర్స్ లో 60 శాతం మంది భారతదేశానికి చెందినవారని నాకు తెలుసు.. అయినా నిజం చెప్పాలంటే.. నేను ఇకపై వారిని పట్టించుకోను. నాకు నా దేశం, నా ప్రజలు, చరిత్ర వైపున నిలబడటంపై నేను శ్రద్ధ పెట్టాను అని వివాదాస్పద కామెంట్స్ చేసింది.
బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
అలీష్బా ఖలీద్ భారతపై వ్యతిరేక అభిప్రాయాను వ్యక్తం చేస్తున్నా మలబార్ సంస్థ .. తమ ఆభరణాల ప్రచారం చేయడానికి ఆమెను నియమించుకుంది. దీంతో ఇప్పుడు నిజంగా మీరు ఈ దేశాన్ని ప్రేమిస్తే మలబార్ గోల్డ్‌ను బహిష్కరించండి. మన అమరవీరులను అవమానించే వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అంటూ ప్రజలను బహిష్కరించాలని కోరుతున్నారు.
మలబార్ గోల్డ్ లో కొనడం ఆపండి. అది ముస్లింల సొంతం. పాకిస్తాన్‌లో పనిచేసే వ్యక్తులకు, ముస్లింలకు మాత్రమే స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. ఎక్కువగా ముస్లింలకు ఉపాధి కల్పిస్తుంది” అని యూజర్ అన్నారు. మరొకరు ఆపరేషన్ సిందూర్‌ను అపహాస్యం చేస్తూ.. పాకిస్తాన్ చీర్ లీడర్లను భారతదేశంలో తీసుకొస్తే సహించ బోమని చెప్పారు. కేరళకు చెందిన ఎంపీ అహ్మద్ యాజమాన్యంలోని కంపెనీ దేశం గురించి పట్టించుకోదా ? దీపావళి ప్రమోషన్ కోసం తన బ్రాండ్ కోసం భారతీయ ఇన్ఫ్లుయెన్సర్‌ను కనుగొనలేకపోయిందా?” అని ఒకరు కామెంట్ చేశారు.
బాంబే హైకోర్టును ఆశ్రయించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
ఖలీద్‌ని ప్రచార కర్తగా నియమించుకుని.. విమర్శలు ఎదుర్కొన్న తర్వాత.. రక్షణ కోరుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ గత నెలలో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తరువాత మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌ను ‘కించపరిచే’ లింక్‌లను తొలగించాలని కోర్టు మెటా, ఎక్స్, గూగుల్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
