హీరోలకు డ్రగ్స్ టెస్టులా? మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్!

సినిమా హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నటుడు మంచు విష్ణు స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
డ్రగ్స్ నియంత్రణపై జడ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి, సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. అభిమానులు తమ అభిమాన నటులను అనుసరిస్తారని, అందుకే హీరోలు ముందుకు వచ్చి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ క్రమంలోనే ఆయన మరో అడుగు ముందుకు వేసి, హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని అభిప్రాయపడ్డారు. అలాంటి చర్యల ద్వారా ప్రజల్లో మంచి సందేశం వెళ్తుందని, డ్రగ్స్‌పై అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక ఈ వ్యాఖ్యలపై మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా, రాజకీయ నాయకులు కూడా ఎన్నికల నామినేషన్‌కు ముందు ఏ విధమైన పరీక్షలు చేయించుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. సమాజంలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
