Mango Leaf Tea: మామిడి ఆకుల టీ.. మెదడు ఆరోగ్యానికి బెస్ట్ మెడిసిన్.. ఎలా తాగాలంటే

mango-leaf-tea

మామిడి ఆకులకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. పండగలు, శుభకార్యాలు, పూజ ఏ సందర్భం అయినా మామిడి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కడతారు. అయితే ఈ మామిడి ఆకులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడి ఆకును ఆయుర్వేదంలో, సాంప్రదాయ వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. మామిడి ఆకు టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటి? టీ తయారీ విధానం తెలుసుకుందాం..

మామిడి ఆకును ఆయుర్వేదంలో అనేక చికిత్సా పద్ధతులలో భాగంగా ఉపయోగిస్తున్నారు. పురాతన కాలం నుంచి ప్రజలు దీనిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మామిడి ఆకు ఆరోగ్య ప్రయోజనాలపై అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. వాటిలో కొన్ని ఈ ఆకును తినడం వల్ల మెదడు కణాలను తిరిగి పెంచడంలో అనేక విధాలుగా సహాయపడుతుందని చూపించాయి. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరం.. అయితే వేల సంవత్సరాలుగా ఆయుర్వేదం ఇదే విషయాని వెల్లడిస్తోంది.

మామిడి ఆకులు అందించే ప్రయోజనాలు

మామిడి ఆకులో మాంగిఫెరిన్, కాటెచిన్స్ , క్వెర్సెటిన్ వంటి పాలీఫెనోలిక్ సమ్మేళనాల సమృద్ధిలో ఉన్నాయి. ఈ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది జ్ఞాపకశక్తి క్షీణత, మానసిక అలసట, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారకం. వీటి నుంచి రక్షణ ఇస్తాయి మామిడి ఆకులు . అంతేకాదు ఈ ఆకులలో పుష్కలంగా లభించే మాంగిఫెరిన్, ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేస్తుంది. వీటిల్లో ఉన్న పాలీఫెనోలిక్ సమ్మేళనాల శోథ నిరోధక స్వభావం మెదడులోని మైక్రోఇన్ఫ్లమేషన్‌ను శాంతపరచడంలో సహాయపడుతుంది. మామిడి ఆకులో ఉన్న ఈ లక్షణాలు నాడీ వ్యవస్థ ఆరోగ్యం , పనితీరుకు మద్దతు ఇస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

2024లో ఆరోగ్యంగా ఉన్న పెద్దవారిపై ఒక అధ్యయనం చేశారు. ఇందులో పెద్దలకు 300 mg మోతాదులో మామిడి ఆకుల టీని ఇచ్చి పరీక్షించారు. ఈ ఫలితం మెదడు పనితీరుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించింది. 2025 అధ్యయనంలో యువకులపై నిర్వహించిన మరో అధ్యయనంలో తక్కువ మోతాదులో మామిడి ఆకు సారం ఇచ్చారు. వీరిలో వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన మానసిక వశ్యత, గందరగోళ భావనలు తగ్గాయని తేలింది.

మెదడు ఆరోగ్యానికి మించి మామిడి ఆకుల ప్రయోజనాలు మెదడు పని తీరుని పెంచే సామర్థ్యంతో పాటు, సాంప్రదాయ వైద్యం , అభివృద్ధి చెందుతున్న ఆధునిక పరిశోధనలు రెండూ మామిడి ఆకులను శరీరానికి సహజ శక్తి కేంద్రంగా గుర్తించాయి. మధుమేహాన్ని నిర్వహించడానికి ఆయుర్వేదంలో మామిడి ఆకులు చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. యాంటీఆక్సిడెంట్లలో దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడం, ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు మామిడి ఆకుల సారం జీవక్రియను పెంచుతుందని.. శరీర కొవ్వును నిర్వహించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి.

మామిడి ఆకుల టీ ఎలా తీసుకోవాలంటే

మామిడి ఆకు టీ: కొన్ని తాజా మామిడి ఆకులను నీటిలో మరిగించడం ద్వారా.. సాధ్యమైనంత మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

టీ తయారు చేయడానికి 4-5 లేత ఆకులను కడిగి, 1.5-2 కప్పుల నీటిలో 10 నిమిషాలు ఉడకబెట్టండి. మూత పెట్టి మరో 5 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత వడకట్టి, నిమ్మకాయ లేదా తేనె కలిపి వేడిగా తాగండి.

మామిడి ఆకుల పొడి: మామిడి ఆకుల పొడిని.. లేదా రసాన్ని.. రసాలతో లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు.

అయితే మామిడి ఆకు టీ లేదా సారాలను మితంగా తీసుకోవడం సురక్షితం. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న వైద్యం తీసుకుంటూ మందులు తీసుకుంటున్న వారు ఈ మామిడి ఆకుల టీని తీసుకునే ముందు వైద్య సహాయం తప్పనిసరి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights