సినిమాని తలపించే సీన్.. పెళ్లింట్లో వధువు తీసుకెళ్ళిన ప్రేమికుడు

పెళ్ళికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంటాయి. తమకు నచ్చిన మనసు మెచ్చిన వీడియోలను షేర్ చేసి సందడి చేస్తారు. తాజాగా పెళ్ళికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో పెళ్లి కోసం ఇల్లు మొత్తం అలంకరించబడి ఉంది. ఆ ఇంట్లో ఉన్న వధువుని ప్రేమికుడు వచ్చి అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు. వైరల్ వీడియో చూసిన తర్వాత ఇది సినిమా దృశ్యంలా ఉందని కామెంట్ చేస్తున్నారు.
చాలా సినిమాల్లో, సీరియల్స్, కథలలో.. పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ప్రేమికుడు రావడం.. లేదా ప్రేమికురాలు రావడం వంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. గత కొంత కాలం క్రితం వరకూ తాను ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకున్నప్పుడు.. ప్రేమికుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయినా సరే కుటుంబం, తండ్రి గౌరవం కోసం, అమ్మాయి కూడా నిశ్శబ్దంగా తన ఆనందాన్ని త్యాగం చేసి వివాహం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రేమికులు తమ ప్రేమ కోసం కుటుంబ సభ్యులపై, సమాజంపై తిరుగుబాటు చేస్తున్నారు.
అందరి ముందు ప్రియురాలితో పెళ్లి ఈ ‘తిరుగుబాటు’ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది వాస్తవంలా అనిపించడం లేదని.. సినిమాలోని సన్నివేశం అని వారు అంటున్నారు. అయితే ఇది సినిమా కాదు.. నిజమైన సంఘటన. flix.indian ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక యువకుడు ఒక అమ్మాయితో కొంతమంది ఆహుతుల మద్య నడుస్తున్నాడు. ఆ వీడియో చూస్తే ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతోందని స్పష్టంగా తెలుస్తుంది. పెళ్లికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇల్లు అలంకరించబడింది. అయితే ఈలోగా పెళ్లి కూతురుని ప్రేమించిన యువకుడు వచ్చి తన ప్రియురాలి నుదట సింధూరం పెట్టి పెళ్లి ఇంటి నుంచి ఆమెను తీసుకువెళ్ళిపోయాడు. ఆ యువకుడు, యువతి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పెళ్లి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆ అమ్మాయి ఏడుస్తోంది. ఆ యువకుడి అక్కడ ఉన్న వ్యక్తులను ఏమైనా చేయండి చూద్దాం అన్నట్లు సవాలు చేస్తున్నట్లు చోస్తూ.. అందరి ముందు వధువును తీసుకెళ్తున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి లక్షలాది మంది వినియోగదారులు దీనిని చూశారు. 2.5 లక్షలకు పైగా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. వీడియోపై రకరకాలుగా స్పందించారు. ఈ మొత్తం సంఘటనను సినిమాని తలపిస్తున్న దృశ్యం అని అభివర్ణించగా.. మరికొందరు అబ్బాయి అమ్మాయిని ఇలా తీసుకెళ్లడం తప్పు అని అన్నారు.
ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఆ అమ్మాయి కనీసం తన తండ్రి గౌరవం గురించి ఆలోచించి ఉండాలి” అని ఒకరు.. “తండ్రి గౌరవం ఏమవుతుందో చెబుతున్న వారికి, ఈ రోజుల్లో బలవంతంగా జరిగే వివాహాలలో ఏమి జరుగుతుందో నేను గుర్తు చేస్తున్నా అని ఒకరు.. తల్లిదండ్రులు తమ కుమార్తెల గురించి కూడా ఆలోచించాలి, లేకుంటే సోనమ్, ముస్కాన్ విషయంలో కూడా అదే జరుగుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది సినిమా సన్నివేశం కాదు, నిజమైన ప్రేమ.. వర్థిల్లాలి ” అని కామెంట్ చేస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
