దేశం లో మరో దారుణం :పదేళ్ల మూగ బాలికపై సామూహిక అత్యాచారం

Mass rape of ten year old dumb girl

TELUGUWONDERS:

ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం జరిపిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేస్తూ గురువారం కోర్టు తీర్పు వెలువరించిన రోజే దేశంలో మరో దారుణ అత్యాచారం జరిగింది. ఓ పదేళ్ల బాలిక బలహీనతను ఆసరా చేసుకొని పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. సమాజం సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

👉మూగ బాలిక అవ్వడం తో ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇద్దరు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బీకనేర్ నగర పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితులిద్దరినీ, పోలీసులు అరెస్టు చేశారు.

దేశంలో కామాంధుల ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు రూపొందించినా, ఎన్ని కఠిన శిక్షలు విధించినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు.

🔴వివరాల ప్రకారం.. :

రాజస్థాన్‌ స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకనేర్ నగర పరిధిలోని సరుందా గ్రామానికి చెందిన ఓ పదేళ్ల బాలిక తల్లిదండ్రులతో నివాసం ఉంటూ, స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఆ బాలిక మూగదైనప్పటికీ తన కుటుంబ సభ్యుల సాయంతో చదువుకుంటోంది. అయితే

👉మూగ బాలిక అవడం తో దారుణం:

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్కూల్ ‌నుంచి ఇంటికి బయలు దేరింది. మార్గ మధ్యంలో అదే గ్రామానికి చెందిన మనోజ్ కుమర్ మేఘ్వాల్, చున్నీలాల్ మేఘ్వాల్ అనే యువకులు ఎదురయ్యారు. వారిలో మనోజ్ కుమార్ ఏదో ఆశ చూపించి, మూగ బాలికను సమీప మైదానంలో ఉన్న గుడిసేలోకి తీసుకెళ్లాడు. చున్నీలాల్ బాలికతో ఉన్న వారిని ఇంటి దగ్గర వదిలేసి, తిరిగి చేరుకున్నాడు. అనంతరం ఇద్దరూ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాటలు రాని ఆ బాలిక పాపం కేకలు కూడా పెట్టలేకపోయింది.

🔴బాలిక ఎంతసేపటికీ రాకపోవడంతో :

స్కూల్‌ నుండి ఎంతకీ రాకపోవడంతో ఆమె తల్లి వెతుక్కుంటూ స్కూల్‌కి బయల్దేరింది. ఆమెను చూసిన నిందితులిద్దరూ పారిపోయారు. వారిని గమనించిన తల్లి గుడిసెలోకి వెళ్లి చూడగా, బాలిక తీవ్ర నొప్పితో బాధపడుతూ కనిపించింది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేయడంతో పాంచూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

🔴నిపుణుల సాయం తో బాలిక వాంగ్మూలం :

బాలిక వాంగ్మూలం నమోదు చేయడానికి నిపుణుల సాయం తీసుకుంటామని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వేదపాల్ శివ్రాన్ తెలిపారు. 👉కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
[09:21, 8/12/2019] Mahendra sreenath: దేశం లో మరో దారుణం ; పదేళ్ల మూగ బాలికపై సామూహిక అత్యాచారం


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights