మెగాస్టార్ పై కక్ష ఎందుకు

Untitled design (42)

Teluguwonders: ప్రజల మనోభావాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియడం లేదు. ఎందుకంటే ఒకసారి నచ్చని విషయం వారికి మరొకసారి నచ్చుతుంది. దానికి కారణం మారుతున్న సమాజాన్ని వారు అవగాహన చేసుకోవడం కావచ్చు ,మరేదైనా కావచ్చు ..ఇదంతా ఎందుకంటే సినిమా అనేది ప్రజలపై అత్యంత ప్రభావం చూపే ఒక వినోద ప్రసార మాధ్యమం. సో సినిమాని అభిమానించే వారు కావొచ్చు , సినిమా నటులను అభిమానించేవారు కావొచ్చు వారిపై వాటి ప్రభావం చాలా వరకు ఉంటుంది . సినిమాలో చేసింది వారు బయట అనుకరించడానికి ప్రయత్నిస్తారు ,అది మంచైనా చెడైనా అది వారిని ఎట్రాక్ట్ చేస్తే చాలు, ఎంటర్టైన్ చేస్తే చాలు వారు ఫాలో అయిపోతారు. అలాగని ప్రజలు పాడైపోయే విధంగా సినిమాలు చేయకూడదని ఆ సినిమాని చేసే దర్శక నిర్మాతలు గాని ఆ నటులు గాని అనుకుంటే ఏ సమస్య ఉండదు .

👉విషయంలోకి వెళితే :

🔴మన్మధుడు 2 : తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లో మన్మథుడుగా అమ్మాయిలతో రొమాన్స్ పండిస్తూ లిప్ లాక్ ముద్దులతో ముంచెత్తుతున్నాడు.

60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా నాగార్జున మాత్రం నవమన్మథుడిగానే ఉన్నారు.కింగ్ నాగార్జున మరోసారి రెచ్చిపోయాడు అనడానికి తాజాగా రిలీజ్ అయినా మన్మథుడు 2 టీజరే నిదర్శనం మన్మథుడు చిత్రంలో పెద్దగా లిప్ లాక్ లు లేకపోయినా ఈ సీక్వెల్ లో మాత్రం దర్శకుడు రాహుల్ గట్టిగానే నాగ్ చేత లిప్ లాక్ లు చేయించాడని అర్ధమవుతుంది. కాగా ఈ సినిమా టీజర్ ఎంత ఎట్రాక్ట్ చేస్తున్నప్పటికీ 👉 మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి : కాగా సొసైటీని చాలా ప్రభావితం చేసే హీరోలు చేసే ఇటువంటి సన్నివేశాలు ప్రజలని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లో ఉండే సన్నివేశాలపై ,లిరిక్స్ పై అభ్యంతరం చెప్పిన మహిళా సంఘాలు దీనిపై మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం విచిత్రం.

🔴గతంలో ఖైదీ నెంబర్ 150 పై రచ్చ : రిలీజ్ అయినప్పుడు ఖైదీ నెంబర్ 150 పాటలు ఎంత సందడి చేశాయో తెలిసిందే కానీ అప్పట్లో ఆ పాటల్లో ఉన్న లిరిక్స్ పై మహిళా సంఘాలు మండిపడ్డాయి . అసలు తెలుగులో నెంబర్ వన్ హీరో అయిన మెగాస్టార్ ఇలాంటి లిరిక్స్ ఉన్న పాటల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని వారు ఆశ్చర్యపోయారు . మెగాస్టార్ చిరంజీవి తన స్థాయికి తగిన విధంగా ఖైదీ నంబర్ 150 పాటలు చేసి ఉండాల్సిందని ఆ మహిళా సంఘాలు అభిప్రాయపడ్డాయి .

🔴ఆ పాటలు ఎందుకు వివాదం అయ్యాయంటే :

అమ్మడు కుమ్ముడు పాటనే ఉదాహరణగా తీసుకుంటే.. . అమ్మడు కుమ్ముడు అంటూ సాగే పాట మెగాస్టార్ స్థాయిని దిగజార్చేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. మెగా ఫ్యాన్స్ కూడా అమ్మడు కుమ్ముడు సాంగ్ వినగానే పెదవి విరిచారు. సామాజిక సందేశం అంటూ తీసిన కత్తి రీమేక్ సినిమాలో రైతన్నలపై తెరకెక్కిన మెగాస్టార్ మూవీ కథలో… బూతు సందేశమా.. ఎందుకీ పాటల్లో బూతు లిరిక్స్ అని వాపోయారు.

🔴సుందరి సాంగ్ పై కూడా వివాదం :
ఇక సుందరి అంటూ సాగే మరో పాట లోని లిరిక్స్…పైకూడా విమర్శలు వెల్లువెత్తాయి. అసలు పదేళ్ల తర్వాత వస్తున్న మెగాస్టార్ 150వ సినిమా అంటే ఎలా ఉండాలి… దాంట్లో పాటలు అంటే ఎలా ఉండాలి అని విమర్శలు గుప్పించారు. 👉హిప్ చూపింది హిప్నటైజ్ చేసింది అంటూ లిరిక్స్ ఉన్న సుందరి పాటను కూడా వారు వ్యతిరేకించారు. 👉ఒక పక్క తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన వయసు మీదపడుతున్నా కొద్దీ… హుందాగా ఉండేలా కథలు ఎంచుకుంటూ… పాటల్లోనే కాకుండా సినిమాలో ఎక్కడా బూతులకు తావులేకుండా చూసుకుంటుంటే… మెగాస్టార్ మాత్రం ఎందుకిలా చేస్తున్నారని ఆ మహిళా సంఘాలు వ్యాఖ్యానించాయి .

🔴ఈ టీజర్ లో వారికి తప్పు కనిపించడం లేదా : టీజర్ లో పెళ్ళి లేట్ అయి బ్రహ్మచారిగా మిగిలిపోయిన నాగ్ ను తన కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా అక్కచెల్లెళ్ళు.. అమ్మ రెచ్చగొడితే నాగ్ కు పౌరుషం వచ్చి మన్మథుడిలా మారతాడు..అని చెప్పకనే చెప్పారు. ఆ తరువాత మన్మథుడు గా మారిన నాగ్ అమ్మాయిలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు..హాట్ హాట్ లిప్ లాక్ లతో రెచ్చిపోయాడు. అయితే ఈ.. సన్నివేశాలు సమాజాన్ని చెడగొట్టే విధంగా లేవా అని ఈ సన్నివేశాలపై మహిళా సంఘాలకు ఎటువంటి అభ్యంతరం లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది . చూద్దాం మన్మథుడు పై మహిళా సంఘాల నిరసన ఎలా ఉంటుందో ఎప్పుడు ఉంటుందో..!!!


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights