కవితకు మంత్రి పదవి….!!!

0
Ministery post for kavitha

Teluguwonders:

తెలంగాణ రాజకీయాలను ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా రాజకీయ మేధావుల మధ్య చర్చకు వచ్చే పేరు కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ తనయ. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్‌గా రాజకీయాలు చేశారు. జాగృతి పేరుతో స్వచ్ఛం సంస్థను కూడా స్తాపించి మహిళలకు నాయకత్వం వహిం చారు. ఇక, 2014లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో గడిచిన ఐదేళ్ల కాలం కూడా ఎంపీ కవితకు ఎదురు లేకుండా పోయింది. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవని అన్నట్టుగా ఇక్కడి రైతులను ఆమె పట్టించుకోని పాపానికి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కవిత్ పోటీ చేసినా అడ్రస్ లేకుండా పోయారు.

పార్టీలోనూ నామినేటెడ్ పదవి ఏదీ ఆమె కోరుకోవడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వం తమదే అయినప్పటికీ.. తనకు ఎలాంటి ప్రాతినిధ్యం లేక పోవడంతో ఒకింత గిల్టీగా ఫీలవుతున్నారు. అయితే, ఇప్పుడు ఆమెకు సువర్ణావకాశం దక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నుంచి గెలిచిన ఉత్తమ్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఈ టికెట్ నుంచి కవితను పోటీ చేయించి గెలిపించుకోవాలని టీఆర్ ఎస్ అధినేత భావిస్తు న్నట్టు టీఆర్ ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే తన కేబినెట్‌లోకి ముగ్గురు మహిళలను తీసుకోవాలని ఆయన అనుకుని కూడా ఇద్దరిని మాత్రమే నియమించారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో కవితకు టికెట్ ఖరారు చేశారని అంటున్నారు కానీ, కవిత విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేష కులు కొంత నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. నిజామాబాద్ ఎఫెక్ట్‌.. నల్లగొండ లోనూ ఉందని, ఇక్కడ టీఆర్ ఎస్ తరఫున ఎవరు పోటీ చేసినా… ఓటమి ఖాయమని అంటున్నారు.

మరీ ముఖ్యంగా కవిత ఎవరినీ పట్టించుకునే స్వభావం లేదని, రైతుల సమస్యలను కూడా ఆమె పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత గెలుపు అంత ఈజీకాదని చెబుతున్నారు. మరోపక్క, ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సైదిరెడ్డి.. తనకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే మంత్రి జగదీష్‌రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. కవితకు లక్కుచిక్కుతుందో లేదో చూడాలి.

Leave a Reply