Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని ఏసీబీ కోర్టుషరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డికి కోర్టు కొన్ని షరత్తులు విధించింది. వారంలో రెండు రోజులు సిట్ విచారణకు హాజరుకావాలని, అలాగే రెండు షూరిటీలు, రూ. 2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. కాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు( మంగళవారం) మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గత జులై 20వ తేదీన ఏపీ లిక్కర్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అప్పటి నుంచి అంటే గత 71 రోజులుగా మిథున్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు రానున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
