మోడీకి జై కొట్టిన ప్రజలు… ఉత్తమ ముఖ్యమంత్రి రేసులో జగన్ కి స్థానం ..

Untitled design - 2019-08-16T111136.246

Teluguwonders:

ఏడాదికి రెండు సార్లు చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు,194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 12,126 ఇంటర్వ్యూలను మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ చేసింది. ఇది జూలై 22, 2019 నుంచి జూలై 30 ,2019 వరకు జరిగింది.

👉నమో మంత్రానికి క్రేజ్ తగ్గలేదు:

ఈ పోల్ లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలతో మరోసారి ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే మోడీ పాపులారిటీ గురించి తెలుపుతున్నాయి. ఒకవేళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే బీజేపీ ఘన విజయం సాధించడమే కాదు… ఇప్పుడు ఉన్న సీట్లకంటే ఎక్కువ సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ చేసిన సర్వేలో వెల్లడైంది.

దాన్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ప్రధాని మోడీ ఉన్నారు. దేశంలో నమో మంత్రానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని ఈ పోల్ ఫలితాలు నిరూపిస్తున్నాయి

💥 ముందువరసలో నరేంద్ర మోడీ:

ఇక సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ ముందువరసలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పాలనే మోడీ పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసింది అని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పేర్కొంది. అంతేకాదు భారతదేశంలోనే అత్యంత బలోపేతమైన రాజకీయనాయకుడిగా మూడ్ ఆఫ్ ది నేషన్ అభివర్ణించింది. ప్రస్తుతం మోడీకి మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ఇచ్చిన రేటింగ్ 71శాతం. ఇదే ఈ ఏడాది జనవరిలో 54శాతంగా ఉన్నింది .

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీ నేతృత్వంలోని బీజేపీకి 308 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది మూడ్ ఆఫ్ ది నేషన్. అంటే 2019లో సాధించిన సీట్ల కంటే మరో 5 సీట్లు ఎక్కువగా వస్తాయని స్పష్టం చేసింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 357 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేసినట్లు మూడ్ ఆఫ్ ది నేషన్‌ పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుందని మూడ్ ఆఫ్ ది నేషన్ పేర్కొంది.అది కూడా రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే వెల్లడించింది. ఇక మొత్తంగా యూపీఏకు దక్కే లోక్‌సభ సీట్లు 92 అని వివరించింది.మోడీ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం అని సర్వేలో పాల్గొన్న చాలా మంది తెలిపారు. ఆ తర్వాత అవినీతిని అంతమొందించేందుకు మోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, నల్లధనంపై యుద్ధం, మానవవనరులను అభివృద్ధి చేయడం మోడీకి కలిసొచ్చాయని సర్వే వెల్లడించింది. అంతేకాదు ఉగ్రవాదంను మోడీ ఉక్కుపాదంతో అణిచివేశారని చాలామంది అభిప్రాయపడ్డారు. గూడ్స్‌ అండ్ సర్వీస్ టాక్సెస్‌ను అమలు చేసి మోడీ ప్రభుత్వం మరో విజయం సాధించిందని సర్వే పేర్కొంది.

🔴జగన్ స్థానం ఎంతో తెలుసా..?

ఇక ముఖ్యమంత్రుల విషయానికొస్తే 👉 సీఎం పాపులారిటీ కేటగిరీలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో నితీష్ కుమార్, దేవేంద్ర ఫడ్నవీస్, అరవింద్ కేజ్రీవాల్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌లు ఉన్నారు. జనవరిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలి స్థానంలో నిలిచారు. కానీ ఈ సారి మాత్రం ఆమె ఏకంగా ఏడో స్థానానికి పడిపోయారు. 👉ఇక ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడు శాతం ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచారు. యోగీ ఆదిత్యనాథ్‌కు 20శాతం ఓట్లు రాగా, నితీష్ కుమార్‌కు 10శాతం ఓట్లు వచ్చాయి.ఇక 8శాతం ఓట్లతో దేవేంద్ర ఫడ్నవీస్, అరవింద్ కేజ్రీవాల్‌లు మూడవ స్థానంలో నిలిచారు.

🔴కాంగ్రెస్‌ విషయం లో:

కాంగ్రెస్‌ను కేవలం ప్రియాంకా గాంధీ మాత్రమే కాపాడగలరని చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 15శాతం మంది ప్రియాంకా గాంధీకి ఓటువేయగా… రాహుల్ గాంధీకి 11శాతం మంది మాత్రమే ఓటువేశారు. ఇదిలా ఉంటే 50శాతం మంది దేశంలో కాంగ్రెస్ అంతం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 👉కానీ ఆసక్తి కలిగించే విషయమేమిటంటే కాంగ్రెస్ బతకాలంటే గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా, వారసత్వం ఉన్న వారు కాకుండా ఇతరులు పార్టీ పగ్గాలు చేపడితే కాంగ్రెస్ దేశంలో బతుకుతుందనే అభిప్రాయాన్ని 49శాతం మంది వ్యక్తం చేశారు.

💥 ఒకే ఒక నరేంద్ర మోడీ :

ఇక కశ్మీర్ సమస్యను ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే పరిష్కరించగలరని 67శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయాలని కూడా గతం లో 57 శాతం మంది తెలిపారు. ఇదిలా ఉంటే 35 శాత మంది భారత్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇది అసాధ్యమేమీ కాదని అయితే కొన్ని సంస్కరణలు తీసుకొస్తే రానున్న ఐదేళ్లలో భారత్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights