ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త……

images (1)

మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. డియర్నెస్ అలవెన్స్ను ఏకంగా ఒకేసారి 5 శాతం పెంచేసింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతానికి పెరిగింది. దీంతో 50 లక్షల మందికి ప్రయోజనం.

  • ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త
  • డీఏ పెంచుతూ కేంద్ర నిర్ణయం
  • 5 శాతం పెంపు.. దీంతో 17 శాతానికి చేరిన డీఏ
  • జూలై 1 నుంచే డీఏ పెంపు నిర్ణయం అమలులోకి

 

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ తీపికబురు తీసుకువచ్చింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యింది. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనం అందనుంది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ డీఏ పెంపు నిర్ణయాన్ని ధ్రువీకరించారు. ‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ 5 శాతం పెంచాం’’ అని తెలిపారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 12 నుంచి 7 శాతానికి పెరిగింది.

డీఏ పెంపు వల్ల దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ర.16,000 కోట్ల భారం పడనుంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2019 జూలై 1 నుంచే పెరిగిన డీఏ లభిస్తుంది. కేంద్ర డీఏను ఏడాదికి రెండు సార్లు సవరిస్తూ ఉంటుంది.

గత కొన్నేళ్లలో ఇదే అతిపెద్ద పెంపు..


మోదీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 5 శాతం పెంచింది. గత కొన్నేళ్లలో ఇదే అతిపెద్ద డీఏ పెంపు కావడం గమనార్హం. ఏఐసీపీఐ గణాంకాలు 2019 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో పెరిగాయి. జూన్ నెలకు డీఏ 17.09 శాతంగా ఉంది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏజీ ఆఫీస్ మాజీ చైర్మన్ హరి శంకర తెలిపారు. గవర్నమెంట్ సాధారణంగా దసరా సమయంలో డీఏ పెంపును ప్రకటిస్తూ ఉంటుంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading