మోడీ చివరి అస్త్రం..అయినా ఆయన్ని కాపాడుతుందా…

0

ఇంకో విడత ముగిస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తిగా ముగిసిపోతుంది. మే 23న దేశంలో అధికారంలోకి వచ్చేది ఎవరో తెలిసిపోతుంది. ఈ చివరి విడతలో మోడీ భారీ తాయిలం ప్రకటించారు. కానీ ఇదేదో ముందే ప్రకటిస్తే నాలుగు ఓట్లు అయినా దక్కేవి. నిండా మునిగాక ఇప్పుడు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది.
👉చిన్న పారిశ్రామికవేత్తలకు మోడీ తీపికబురు : మోడీ ప్రభుత్వం తాజాగా యూనివర్సల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చిన్న రుణదారులకు సాయం చేయడమే ఈ పథకం లక్ష్యం. దీనిద్వారా చిన్న రైతులు – కళాకారులు – చిన్నపారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అయితే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తేనే మోడీ ఈ పథకం అమలు చేసే అవకాశాలున్నాయి.
🔴Conditions apply : 👉సంవత్సర ఆదాయం రూ60వేల కంటే తక్కువ ఉన్నవారికి ఈ పథకం వర్తింప చేస్తారట..

👉రూ.35వేల కంటే తక్కువ రుణాలు ఆస్తుల విలువ రూ.20వేల అంతకంటే తక్కువ ఉన్న వారే ఈ పథకానికి అర్హులట..

👉చిన్న మొత్తంలో తీసుకున్న వారు రుణం తిరిగి చెల్లించలేని వారిని రుణాలనుంచి విముక్తి కలిగించేందుకు ఈ పథకమట.. అయితే రుణాలు మాఫీ కావాలంటే అంతకుముందు ఏదీ బ్యాంకులకు ఇతర సంస్థలకు ఎగ్గొట్టకుండా ఉండాలట.. ఈ పథకానికి రూ.20వేల కోట్లను కేంద్రం కేటాయిస్తోంది.అయితే

🔴ఈ పథకం పై పెద్ద రీతి లో విమర్శలు : ఈ పథకం పై పెద్ద రీతి లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. conditionsలతో దేశంలో చాలా మందికి ఈ పథకాన్ని అక్కరకు రాకుండా తయారు చేశారన్న విమర్శ వ్యక్తమవుతోంది.

🔸విమర్శకు కారణం : రూ.35వేల కంటే తక్కువ రుణం అందరూ ఈజీగా తేల్చేయగలరు. కనీసం లక్షవరకూ ఉంటేనే ఎవరికైనా లబ్ధి.ఇలా సర్వ ఆంక్షలు పెట్టి మళ్ళీ పదవి కోరుకోవటం..సమంజసం కాదని అభిప్రాయాలు..వెల్లడౌతున్నాయి.. మొత్తానికి సెంట్రల్ లో ఈ సారి మోడీ రావడం డౌటే..

Leave a Reply