Mohanlal: మొన్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. ఇప్పుడు ఆర్మీలో గౌరవం.. మోహన్ లాల్‌కు ఆర్మీ చీఫ్ ప్రశంసలు..

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ ఇటీవలే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందించింది కేంద్రం. టెరిటోరియల్ ఆర్మీలో తన 16వ సంవత్సరాన్ని పురస్కరించుకుని భారత సైన్యం ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని అందజేసింది.
మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్.. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. సినీరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ కేంద్రం ఇటీవలే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందించింది. ఇప్పుడు ఆయనకు మరో గౌరవం దక్కింది. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో తన 16వ సంవత్సరాన్ని పురస్కరించుకుని భారత సైన్యం ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని అందజేసింది. భారత ఆర్మీ చీఫ్ నుండి ఈ గౌరవం అందుకోవడం తనకు సంతోషంగా ఉందని మోహన్ లాల్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. గతేడాది వయనాడ్ ప్రకృతి వైపరీత్యం సమయంలో సహాయ చర్యలకు స్వచ్ఛందంగా అందించిన విరాళం, సైనికుల పట్ల ఆయనకున్న గౌరవానికి గుర్తింపుగా సీవోఏఎస్ కార్డును అందజేసినట్లు ఆర్మీ చీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సీవోఏఎస్ కార్డును అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “భారత ఆర్మీ చీఫ్ నుండి ఈ గౌరవం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ సైతం ఈ గౌరవం అందుకోవడానికి ఒక కారణం. అక్కడ ఏడుగురు ఆర్మీ కమాండర్ల సమక్షంలో నాకు సీఓఏఎస్ కార్డు లభించింది. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ గా ఈ గుర్తింపు అందుకోవడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. యువ తరాన్ని సైన్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సైన్యం కోసం, పౌరుల శ్రేయస్సు కోరకు చేయగలిగినదంతా చేస్తున్నాను. నేను ఆర్మీ చీఫ్.. ఆర్మీ బెటాలియన్లకు మరింత సామర్థ్యాన్ని ఎలా తీసుకురావాలి.. దేశం కోసం ఇంకా ఏమి చేయవచ్చనే దాని మీద చర్చించాము” అని రాసుకొచ్చారు.
మోహన్ లాల్ 2009 లో టెరిటోరియల్ ఆర్మీలో చేరారు. ఆయనకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఆయన భారత సైన్యంలోని 122వ ఇన్ఫాంట్రీ బెటాలియన్ (TA) మద్రాస్ డివిజన్ సభ్యుడు కావడం గమనార్హం. ఈ సంవత్సరం వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఎంపురాన్, తుడురమ్, హృదయపూర్వం వంటి చిత్రాలతో జనాలకు మరింత దగ్గరయ్యారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
