అల వైకుంఠపురంలో (అల విజయపురంలో..)త్రివిక్రమ్ మాటలు.. మేకింగ్‌తో మ్యాజిక్ చేస్తాడు. ఇదే స్టైల్లో వెళ్తూ అల వైకుంఠపురంలో మూవీని అల విజయపురంలోకి తీసుకెళ్లాడు. అల్లు అర్జున్‌కు వున్న స్టైలిష్ ఇమేజ్‌ను త్రివిక్రమ్ ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వాడేసుకున్నాడు. లుక్‌లోను.. నడకలోను.. పాటల్లోనే కాదు.. ఫైట్స్‌లోనూ స్టైలిష్‌గా కనిపించాడు బన్నీ. సాధారణంగా ఫైట్స్ మాస్‌గా వుంటాయి. కానీ ఇందులోని ప్రతి యాక్షన్ సీన్ స్టైలిష్‌కు అమ్మామొగుడిలా సాగింది. పాత కథలనే త్రివిక్రమ్ మళ్లీ తీస్తాడన్న విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాత సినిమా ఏమిటో నేను చూడలేకపోవడంతో… డైలాగ్స్.. టేకింగ్‌తో మాయ చేశాడనిపించింది. అన్ని జనరేషన్స్ ఆచరించాల్సిన’నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది’ అన్న గొప్ప మెసేజ్‌ను ఇచ్చిందీ ఈ వైకుంఠపురం. ఈ సినిమాతో బన్నీ తనకున్న స్టైలిష్ ఇమేజ్‌ను డబుల్ చేసుకుని.. బంటు పాత్రను పెర్‌ఫార్మెన్స్‌తో నిలబెట్టాడు. అభినయం విషయానికొస్తే.. అందరికంటే ముందు మురళి శర్మను చెప్పాలి. ఆయన కెరీర్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇదే. గ్లామర్ రోల్ చేయాలంటే.. తనే అన్నట్టుగా పూజా హెగ్డే ఇంప్రెస్ చేస్తుంది. కాకపోతే.. దర్శకుడు ఎక్కువగా ఈ అమ్మడి థైస్‌పై ఫోకస్ పెట్టాడు.
అద్భుతమైన సామజవరగమన పాటకు ఇన్‌స్పిరేషన్‌కు కారణం థైసే అన్నట్టు చూపించడం కాస్త బాగోలేదు. సామజనవరగమన… రాములో.. రాముల వంటి రెండు పాటలతో సినిమాకు హైప్ తీసుకొచ్చిన తమన్.. అంతే అందంగా రీరికార్డింగ్ ఇచ్చాడు.
జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్నీ, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కలను ‘అల వైకుంఠపురంలో’ తీర్చింది.