తిరుగు లేదు..మహర్షి ఏలేస్తాడు

Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది.
హైలైట్స్:
నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ‘మహర్షి’ మూవీ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు మహేష్ కెరియర్‌లో 25వ మూవీ మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో
దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘మహర్షి’.
ఏలేద్దాం అనుకుంటున్నా సార్.. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా సార్.. అంటూ ‘మహర్షి’ ట్రైలర్‌లో ధీమాగా చెప్పిన మహేష్ బాబు అన్నట్టుగానే ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. మహేష్ కెరియర్‌లో 25 మూవీగా వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించింది. గత రాత్రి నుండే థియేటర్స్ వద్ద అభిమానులు కోలాహలంతో థియేటర్స్ అన్నీ సందడిగా మారాయి. ఇప్పటికే యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బెనిఫిట్ షో‌లు ప్రదర్శితం కావడంతో బ్లాక్ బస్టర్.. బాబు బంగారం.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రంపై ప్రేక్షకుల స్పందనలను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

👉విశ్లేషణ :
సినిమా సూపర్ హిట్. సినిమా రన్ టైం అండ్ సాంగ్స్ చిన్న డిజప్పాయింట్ తప్పితే మిగతా అన్ని క్రాఫ్ట్ అండ్ యాక్టర్స్ నిలబెట్టేశారు సినిమాని. ‘‘మహర్షి’ సినిమా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేసింది. ఎమోషనల్‌గా సాగిన క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లింది. పదరా పదరా సాంగ్ అదిరిపోయింది. గొడ్ల బండి ఫైట్ సూపర్బ్. బొమ్మ హిట్టూ.. నా రేటింగ్ 4/5’’అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పారు.

🎙మహర్షి ఫస్టాఫ్.. యూత్ అండ్ క్లాస్ ఆడియన్స్ కోసం.. సెకండాఫ్ మాస్ ఆడియన్స్‌కి.. ఓవరాల్‌గా ‘మహర్షి’ ఎమోషనల్ జర్నీ ఫుల్ మీల్స్ బ్లాక్ బస్టర్.అని కొందరు…

🎙రైతులపై ఉండాల్సింది సింపథీ మాత్రమే కాదు.. వాళ్లను గౌరవించడం మన బాధ్యత. దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలపై అద్భుతమైన సందేశం. ‘మహర్షి’ చిత్రంలో ఫార్మర్ ఎపిసోడ్ ప్యూర్ గోల్డ్ అని కొందరు..

🎙‘నేను రైతు బిడ్డనే అని గుర్తు చేశావ్ కదా అన్నా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి థాంక్స్ అంటూ మరొక వ్యక్తి ఎమోషనల్ గా చెప్పారు .

ఇదిలా ఉండగా సినిమా పై కొంత నెగటివ్ టాక్ కూడా వస్తుంది..
👉Negative టాక్ :మంచి టాక్ తో పాటు నెగిటివ్ టాక్ కూడా మహర్షి చిత్రంపై వస్తున్నాయి.. ‘ఇది చాలా ఫన్నీ స్టోరీ.. సెకండాఫ్ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. టిక్కెట్ డబ్బులు బొక్క’ అంటున్నారు.
ఏం జరుగుతుందిరా బాబు.. సెకండాఫ్‌లో ఆఫీస్ ఏంటో అర్ధం కాకుండా ఉంది. దీనికి తోడు ఆ సాంగ్స్ ఏంటి? అంటూ తల పట్టుకునే ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా mixed టాక్ ఉన్నా, సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉన్నా.. మహేష్ స్క్రీన్ presence ఇంకా యాక్టింగ్, వంశీ పైడి పల్లి టేకింగ్ కలిసొచ్చేఅంశాలు అయితే..ఈ సమ్మర్ లో మరో..పెద్ద హీరో సినిమా లేకపోవడం…ఈ అంశాలు అన్నింటితో doubt లేదు..మహర్షి ఈ వేసవిని ఏలేస్తాడు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading