నచ్చకుండా చేసిన ఆ పాత్రే రమ్యకృష్ణ.. రేంజ్ ని మార్చేసింది.

Spread the love

ఎంతమంది నటీమణులు ఉన్నా… కొన్ని పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయి. అలా నీలాంబరి, శివగామిని పాత్రలు రమ్యకృష్ణకు మాత్రమే సెట్ అయ్యాయి. 👉రమ్యకృష్ణ… సహజనటి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి 🔴నీలాంబరి గా నరసింహా లో ; ఈ సినిమాలో నీలాంబరి పాత్ర చేసింది రమ్యకృష్ణ…. చాలా పవర్ఫుల్ పాత్ర అది. పొగరబోతుగా కనిపించాలి. తల నుంచి కాళ్ళ వరకు అడుగడుగునా అహంకారం…. పొగరు కనిపించాలి. కళ్ళల్లో, పేస్ లో ఆ భావాలు పలికించాలి. ఇలాంటి పాత్ర చేయడం అంటే చాలా కష్టం. అందుకే దర్శక నిర్మాతలు రమ్యకృష్ణను సెలెక్ట్ చేసుకున్నారు.

నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణ నూటికి నూరుశాతం న్యాయం చేసింది. పాత్రలో అదరగొట్టింది. అయితే, 👉విచిత్రమయిన విషయం ఏంటంటే మొదట్లో ఆ పాత్ర రమ్యకు నచ్చలేదట. పొగరగా ఉండే పాత్ర చేయాలంటే కష్టం అనిపించింది. ఇష్టం లేకుండా దర్శకుడు చెప్పింది నమ్మి చేసినట్టు రమ్యకృష్ణ పలుమార్లు చెప్పింది. ఈ పాత్ర తరువాత ఇలాంటి పాత్రలు ఎన్నో వచ్చాయి.
🔴శివగామి గా :
బాహుబలిలో శివగామిని పాత్ర, సినిమాలో ప్రభాస్, రానాల కంటే కూడా హైలైట్ గా నిలిచింది. శివగామినిగా రమ్యకృష్ణ జీవించింది. ఈ రకంగా ఈ రెండు పాత్రలతో తనకంటూ..తెలుగు,తమిళ చలన చిత్ర చరిత్ర లో..రమ్య కృష్ణ రెండు పేజీలను రాసుకుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading