సూర్య N. g. k మూవీ రివ్యూ…

Spread the love

తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘NGK’. భారీ అంచనాలతో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. 👉ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య…గత కొన్నేళ్లగా వరుస ఫ్లాపులతో భాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉన్నా కానీ ఫలితం కనిపించటం లేదు. అయితే విభిన్నమైన కథలకు విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం కావటంతో కొంతమంది ఆయన అభిమానులు ఆశపెట్టుకున్నారు. సూర్య మాత్రం ఇది తనకు కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందని ఆశించి భారీగానే ప్రమోట్ చేసారు. ఎంతచేసినా తెలుగులో ‘ఎన్జీకే’కు ఎందుకో క్రేజ్ కనపడట్లేదు.మరి ఈ సినిమాతో దర్శకుడు సెల్వ రాఘవన్.. సూర్యకు మంచి సక్సెస్ అందించాడా లేదా మన రివ్యూలో చూద్దాం…

🔹కథ విషయానికొస్తే..

ఎం.టెక్ వంటి ఉన్నత చదవులు నంద గోపాలకృష్ణ (సూర్య) తన సొంత ఊరిలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటాడు. అలా ఉంటూనే ఊర్లో వాళ్లకు తలలో నాలుక అవుతాడు. అలా ఉంటూనే ఆ ఊరి ఎమ్మెల్యేకు దగ్గరవుతాడు అతని అండగా నిలబడతాడు. ఐతే కలిసి పనిచేస్తోన్న సమయంలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్న నందగోపాల కృష్ణ రాజకీయాలను ప్రక్షాళన చేయాలనుకుంటాడు. అందుకే ప్రజా పాలన పార్టీని నెలకొల్పుతాడు. ఇంతకీ పార్టీ పెట్టిన హీరో ఎన్నికల్లో గెలిచి తాను అనుకున్నది సాధించాడా లేదా అనేదే ‘ఎన్జీకే’ సినిమా స్టోరీ.

🔴 టెక్నికల్ గా ..
మొదటగా ఈ సినిమాలో సూర్య నటన గురించి మాట్లాడుకోవాలి. ఇంత బోర్ సినిమాని చివరి దాకా చూడగలిగాము అంటే అది సూర్య ప్రతిభనే. సాయి పల్లవి పాత్ర పరమ బోర్. రకుల్ ప్రీతి సింగ్ పాత్ర గతంలో ఓ సినిమాలో వచ్చేసిందే . రిపీట్ చేసారు. సంగీతం విషయానికి వస్తే సెల్వ రాఘవన్, యవన్ కాంబోలో గతంలో క్లాసిక్స్ అనదగ్గ బ్లాక్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. అవి ఇప్పటికి వినపడుతున్నాయి. ఈ సినిమాలో పాటలు రిలీజ్ రోజున కూడా వినపడటం లేదు. అంతలా నిరాశపరిచారు. దానికి తోడు సినిమానే బోర్ అంటే ఈ పాటలు మధ్య మద్యలో వచ్చి బోర్ ని రెట్టింపు చేసే పోగ్రామ్ పెట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బ్యాడ్ గా ఉంది. డైరక్షన్ తో సహా దాదాపు ప్రతీ డిపార్టమెంట్(సినిమాటోగ్రఫీ మినహా) సినిమాని తమదైన స్టైల్ లో తగ్గించే శాయి. అయినా తమిళ నేటివిటి విపరీతంగా ఉన్న ఈ సినిమాని భరిచటం కష్టమే.
🔹నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు

🔹దర్శకుడు: సెల్వ రాఘవన్

🔹నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రభు, ప్రకాష్ బాబు

🔹సినిమాటోగ్రఫీ : శివకుమార్ విజయన్

🔹మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

🔴విశ్లేషణ:

7/G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్‌తో మెప్పించిన సెల్వ రాఘవన్..ఈ సారి సూర్యతో పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. సాధారణ కార్యకర్త సీఎం స్థాయి ఎదగాడనే కాన్సెప్ట్‌కు తగ్గట్టు సీన్స్ అల్లుకోవడంలో సెల్వరాఘవన్ విఫలమయ్యాడు. హీరోయిన్ సాయి పల్లవితో సూర్య సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కొన్ని సినిమాలు గుర్తుకు రాకమానవు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

➕ప్లస్ :

సూర్య నటన,
ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు
మ్యూజిక్,
⛔మైనస్ :

కథ:
సరైన కథనం లేకపోవడం,
దర్శకత్వం.

📌Rating: 2/5

చివరి మాట: రొటీన్ పొలిటికల్ డ్రామా..


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading