నటీనటులు: సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి జబర్దస్త్ బ్యాచ్
డైరక్షన్: అరుణ్ పవార్
నిర్మాతలు: నరేంద్ర, జివియన్ రెడ్డి
సంగీతం: బుల్గానియన్
విడుదల తేదీ: జూన్ 14, 2019
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సప్తగిరి `సప్తగిరి ఎక్స్ ప్రెస్`తో హీరోగా మారాడు. తాజాగా `వజ్రకవచధర గోవింద` సినిమాతో మరోమారు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ పవార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
🔴కథ :
గోవింద (సప్తగిరి ) తన ఊర్లో ప్రజలంతా కాన్సర్ తో చనిపోతూ ఉండడం తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా దీనిని అరికట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తనకు సాయం చేస్తానన్న ఎమ్మెల్యే చేతిలో కూడా మోసపోతాడు. ఈ నేపథ్యంలో గోవింద కు ఓ నిధికి సంబందించిన విషయం తెలుస్తుంది. ఆ నిధి ని కనిపెట్టి..దాంతో ఊరి ప్రజలను కాపాడాలని అనుకుంటాడు.
ఈ నిధి విషయం గోవింద కు తెలుసు అని తెలుసుకున్న రౌడీ బ్యాచ్ గోవింద వెంటపడతారు. మరి ఆ రౌడీ గ్యాంగ్ నుండి గోవింద ఎలా తప్పించుకోగలిగాడు ..? నిధి ని సంపాదించాడా లేదా..? ఆ నిధి కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు..? ఆ ఊరి ప్రజలను ఎలా కాపాడుకోగలిగాడు..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.
సినిమా నిండా పాత్రలే ఉన్నప్పటికీ , ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నా కూడా సినిమా ఆసక్తికరంగా సాగలేదు. ఫస్టాఫ్ కథలోకి వెళ్లడానికి నానా పాట్లు పడ్డప్పటికీ, సెకండాఫ్ కి వచ్చేసరికీ పసలేని సన్నివేశాలు కాలయాపన చేసాడు, కామెడీ అక్కడక్కడ పండించడం వల్ల కొంత బోర్ అనేది పోగొడుతుంది.
సప్తగిరి కి ఇచ్చిన బిల్డప్ సీన్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఆయన చేసే ఫైట్స్ ఒక పెద్ద హీరో చేసే రేంజ్ లో ఉండటం వల్ల ఓవర్ అనిపిస్తుంది. కామెడీ మీద కంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా రాసాడు హీరోకి దర్శకుడు పవార్. ఇక రెగ్యులర్ కామెడీ, లాజిక్ లేని సీన్స్ తో సినిమా అంతా గందరగోళం గోవింద గా మారింది. ఎమోషనల్ కంటెంట్ ఉన్నా కానీ దాన్ని సరిగ్గా వాడుకోలేదు. సప్తగిరి ఉన్నాడు కదా అని కామెడీ ఎక్స్ పెక్ట్ చేసి వెళితే…దెబ్బై పోతారు. సప్తగిరి చేసే కాసింత యాక్షన్, మరి కాసింత కామెడీ చూసి కాలక్షేపం చేద్దామనుకునే వాళ్లు సినిమాకు వెళ్లవచ్చు.
🔴నటీనటుల పర్ఫార్మెన్స్ :
👉సినిమాకు సప్తగిరి నటన ప్రధాన ఆకర్షణ : సప్తగిరి యాక్టింగ్..కామెడీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు..ఆయన వేసి పంచ్ లు..డైలాగ్స్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఈ సినిమాలో కూడా అదే రీతిలో నవ్వించే ప్రయత్నామ్ చేసారు. సప్తగిరి యాక్షన్ లో కంటే కామెడీ లోనే బాగా ఆట్టుకున్నాడు. గతం మర్చిపోయిన సన్నివేశాల్లో.. రౌడీలతో సాగే సన్నివేశాల్లో అలాగే వజ్రం కోసం గుహలోకి వెళ్లిన సీన్స్ లో సప్తగిరి తన అద్భుతమైనకామెడీ టైమింగ్ తో అలరించారు, . 👉వైభవి జోషి తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. 👉 లేట్ గా ఎంటర్ అయినా శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర బజర్దస్త్ టీమ్ నవ్వించే ప్రయత్నం చేసారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు.
సాంకేతిక విభాగం :
👉బుల్గానియన్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నేపథ్యం సంగీతం కూడా మామూలుగానే ఉంది.
👉సినిమా ఫొటోగ్రఫీ కొన్ని చోట్ల బాగానే ఉందనిపించింది.
👉ఎడిటింగ్ విషయంలో కూడా అక్కడక్కడా బోర్ కొట్టించింది. సెకండ్ హాఫ్ లో అనవసర సీన్ల తో విసుగు తెప్పించారు.
👉నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాణ విలువలు కథకు తగ్గట్లే ఉన్నాయి.
👉ఇక డైరెక్టర్ అరుణ్ పవర్ విషయానికి వస్తే ఎందులోనూ తన సత్తా చాటలేకపోయారు.
కథ ఇంట్రస్టింగ్ గానే ఉన్నప్పటికీ, దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కొంత విఫలమయ్యాడనే చెప్పాలి. అందులో సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉంటాయి.
👉🔴ఫైనల్ గా చెప్పాలంటే… ఓవరాల్ గా సప్తగిరి బిల్డప్ ఇచ్చాడు తప్ప కథలో దమ్ము చూపించించలేకపోయాడు
🔴 రేటింగ్ : 2/5
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.