Teluguwonders: థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా వీడియో గేమ్ బ్యాక్ డ్రాప్‌లో ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఆసక్తి రేకెత్తించి, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి Game Over లో తాప్సీ ఆడిన గేమ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా.. లేక బోర్ కొట్టించిందా..అనేది చూద్దాం..
👉కథ : వీడియో Game డెవలపర్ అయిన స్వప్న తల్లితండ్రులకు దూరంగా కోకాపేటలో నివసిస్తూ ఉంటుంది. ఆమె పనిమనిషి కళమ్మ స్వప్నతోనే ఉంటూ ఇంట్లో పనులన్నీ చేస్తుంది. అయితే తాప్సీకి చీకటి అంటే చాలా భయం. అదీకాక తనను ఎవరో చంపుతున్నట్టు కలలు కూడా కంటుంది. ఇలా సాగుతున్న కథలో అనుకోకుండా తాప్సీకి వచ్చిన కల నిజంగా జరుగుతూ ఉంటుంది. మరి ఆ కలలో కనిపించినట్టు తాప్సీ చనిపోతుందా.. లేక తన భయాన్ని పక్కన పెట్టి పోరాడి ప్రాణాలు దక్కించుకుంటుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
👉నటీనటుల విషయానికొస్తే : ఈ సినిమాలో కూడా పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రను పోషించిన తాప్సి అద్భుతంగా నటించింది. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తాప్సి పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలలో తాప్సీ నటన చాలా బాగుందని చెప్పవచ్చు. వినోదిని వైద్యనాథన్ కూడా తన పాత్రకు ప్రాణం పోశారు. వినోదిని వైద్యనాథన్ నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అనీష్ కురువిల్లా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. మానసిక వైద్యుడి పాత్రలో కనిపించిన అనీష్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాడు.
సంచన నటరాజన్ కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. రమ్య సుబ్రహ్మణ్యం చాలా సహజంగా నటించింది. పార్వతి కూడా చాలా బాగా నటించింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు అశ్విని శరవణన్ ఈ సినిమా కోసం అద్భుతమైన కథను అందించారు. సినిమా మొదటి నుంచి ఆఖరివరకు ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమాను చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
అశ్విన్ శరవణన్ కథను నెరేట్ చేసిన విధానం కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. వై నాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలు మంచి నిర్మాణ విలువలను అందించారు.
రోన్ ఈథాన్ యోహన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాకి ఏ వసంత్ అద్భుతమైన విజువల్స్ ను అందించారు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా రంగంలో కన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. హీరో బేస్డ్, రోటీన్ కమర్షియల్ సినిమాల నుంచి ప్రేక్షకులు క్రమక్రమంగా బయటకు వస్తున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆదరిస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఈ ట్రెండును తమకు అనుకూలంగా మలుచుకుంటూ పలువురు యువ దర్శకులు సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ ‘గేమ్ ఓవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
🔴బ్రిలియంట్ స్క్రీన్ ప్లే :
“Game Over” కథకు బ్రిలియంట్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ జోడించి ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు సీట్లో కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఉపయోగించని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హీరో అని చెప్పొచ్చు.
🔴ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్ తాప్సీ పెర్ఫార్మెన్స్,
బ్రిలియంట్ స్క్రీన్ ప్లే,
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
🔴మైనస్ పాయింట్స్ :
మొదటి భాగంలో సాగదీత కాస్త ఎక్కువగా ఉండటం,
కొన్ని చోట్ల కన్ ప్యూజన్ ఉండటం..
👉తాప్సీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ :
తాప్సీ కెరీర్లో ‘గేమ్ ఓవర్’ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పింక్, బద్లా లాంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న ఈ ఢిల్లీ బ్యూటీ ఈ సినిమా ద్వారా మరొక మెట్టు ఎక్కిందని చెప్పక తప్పదు.
🔴నటీనటులు: తాప్సీ పన్ను, వినోదిని వైద్య నాథన్, అనీష్ కురువిల్ల, సంచన నటజరాజన్, రమ్య సుబ్రమణియన్, పార్వతి.
సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్
మాటలు: వెంకట్ కాచర్ల
ఛాయా గ్రహణం: ఎ.వసంత్
సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా)
నిర్మాత: ఎస్.శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్
విడుదల తేదీ: జూన్ 14, 2019
🔴చివరగా :
‘గేమ్ ఓవర్’ రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా. కమర్షియల్ అంశాలు, వినోదం ఆశించి వెళితే నిరాశ తప్పదు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, కొత్త కాన్సెప్టులను ఈజీగా అడాప్ట్ చేసుకోగల వారికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది.
రేటింగ్ : 2.75/5
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.