Teluguwonders: 20 ఏళ్ళ ముందు రిలీజ్ ఆయి 11 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయిన గ్లాడియేటర్..సినిమా గుర్తుంది కదా..ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుందట.
❇గ్లాడియేటర్ :
రిడ్లీ స్కాట్ దర్సకత్వంలో 2000 వ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటి గ్లాడియేటర్. రోమ్ సామ్రాజ్యంలో రాజులు, చక్రవర్తులు బానిసలను వేట జంతువుల్లా పరగణిస్తూ, వారి ప్రాణాలతో ఏవిధంగా ఆడుకుంటారో ఇందులో చూపించారు. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం 460 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
👉11 విభాగాల్లో ఆస్కార్ : 2000 సంవత్సరంలో విడుదలైన గ్లాడియేటర్ 11 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ కాగా, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్‌ను గెలుచుకుంది.
🔴సీక్వెల్ కి ఎందుకింత లేటు : హాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాలకు సీక్వెల్ తీస్తున్నారు. హిట్ కొడుతున్నారు.
అయితే, గ్లాడియేటర్ సినిమాకు సీక్వెల్ తీయడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఈ 20 సంవత్సరాల కాలంలో గ్లాడియేటర్ సినిమాకు కనీసం నాలుగు సీక్వెల్స్ అయినా తీసేవారు. ఎందుకని ఇంత లేట్ చేశారో అర్ధంకాని విషయం.
❇గ్లాడియేటర్ -2 కథ :
ఇక ‘గ్లాడియేటర్’ కథ ముగిసిన 25 లేదా 30 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే నేపథ్యంలో ‘గ్లాడియేటర్2’ సాగుతుందట. ఇందులో ల్యూసిల్లా పాత్ర పోషించిన నీల్సన్ కొడుకు ల్యూషియస్ పెద్దవాడైన తర్వాత ఏం చేశాడన్న ఇతివృతంగా కథ ఉంటుందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.