teluguwonders: అతని సినిమాలు కొత్తదనాన్ని అన్వేషిస్తాయి. అతను చేసే పాత్రలు కథనే నమ్ముతాయి. శతమానంభవతి లో ఒక తాతకు మనవడిగా నటించినా,మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లో ఒక కూతురికి తండ్రిలా నటించిన తనకు తానే సాటి అనిపించుకునే నటుడు హీరో శర్వానంద్.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి తాను చేసే సినిమాల్లో కొంత వెరైటీ ఉండాలని ఆశించే హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు అనే చెప్పాలి. రొటీన్ సినిమాలకు భిన్నంగా కాస్త వెరైటీ గా కథలు ఎంచుకునే శర్వానంద్, ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పడి పడి లేచే మనసుమంచి అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ గా నిలవడం తో కాస్త నిరుత్సాహపడ్డాడు.
🔴షూటింగ్ లో గాయపడిన శర్వానంద్ :
ఇక ప్రస్తుతం రణరంగం మరియు 96 రీమేక్ సినిమాల్లో నటిస్తున్న శర్వానంద్, నిన్న 96 సినిమా రీమేక్ షూటింగ్ లో గాయపడడం జరిగింది. ఈ సినిమా కోసం నిన్న థాయిలాండ్ లో స్కై డైవింగ్ కు సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్న శర్వానంద్ కు అనుకోకుండా గాయమైందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
అందిన సమాచారం ప్రకారం అయితే గాయం మరీ అంత పెద్దది అయితే కాదని తెలిసింది. ఇక తగిలిన గాయానికి కాసేపటి క్రితం దాదాపుగా 11గంటలపాటు డాక్టర్లు ఎంతో శ్రమపడి సర్జరీ విజయవంతంగా నిర్వహించారని తెలిసింది, 👉 అయితే సర్జరీ అనంతరం ఆయనకు 2 నెలలవరకు రెస్ట్ అవసరం అని వారు సూచిందడం జరిగిందట.
అయితే ఆయనకు కొంత విరామం కావాలని రెస్ట్ అనంతరం అయన పూర్తిగా కోలుకుని మళ్ళి తన సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం జరుగుతుందని అయన పిఆర్ టీమ్ వెల్లడించింది. ఇక సర్జరీ విజయవంతం అవడంతో శర్వా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారట. ఇక కొందరు సినీ ప్రముఖులు శర్వాను జాగ్రత్తగా ఉండాలని, హాయిగా రెస్ట్ తీసుకుని త్వరలో మళ్ళి షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుంటూ సూచనలు,జాగ్రత్తలు చెప్తున్నారట.
🔴అశుభ సూచకం : వరుణ్ తేజ్ సందీప్ కిషన్ నాగ శౌర్య ఇప్పుడు శర్వానంద్ వరుసగా ఇలా హీరోలందరికీ యాక్సిడెంట్ అవ్వడం అశుభ సూచకంగా కనిపిస్తుందని దానికి ఇప్పటికైనా ఏదొక రెమిడీ తీసుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు లేదంటే ముందు ముందు ఇంకా ఏం జరగబోతుందో చెప్పలేం అని వారు సందేహపడుతున్నారు.