TeluguWonders
ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో తెలుగు దేశం పార్టీ వర్సెస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేలా బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే . ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం వారు.. బాలకృష్ణ ‘సమర సింహా రెడ్డి’ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. బాలయ్య కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నటు వంటి ఫోటోను సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు .
👉ఆ ప్రకటన ఆ ప్రకటనలో 2000లో నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటన ఉంది.
బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడుగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి
🔴ఈ ప్రకటన పై వైసీపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ ఆ ప్రకటన పై వైసీపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ చేసారు. అంతేకాదు అసలు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అసలు ఏ హీరోకు కూడా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉండలేదు. అంటూ సదరు టీడీపీ శ్రేణులు సర్కులేట్ చేస్తున్న ఫోటోకు కౌంటర్‌గా మరో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అదంత ఫేక్ ఎడిటింగ్ అని చెబుతున్నారు. అంతేకాదు
🔴2003 లోని ఫోటో 2000 లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఉన్న ప్రకటన వెనక ఎవరో ఎడిట్ చేసినట్టుగానే ఉంది. ఎందుకంటే , 2003లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి తన భార్యతో గార్డెన్‌లోఒక ఫోటో దిగారు. అయితే అదే ఫోటో వచ్చిన పేపర్ ప్రకటన లో మాత్రం 2000 సంవత్సరం అని ఉంది.. 2003 లోదిగిన ఫోటో 2000 లో పేపర్ ప్రకటన లో ఎలా వస్తుంది అని ,ఇదంతా ఫాల్స్ అంటూ 2003 లో జగన్ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 🔴వై.యస్.జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మరోవైపు బాలయ్యకు జగన్ అనే అభిమాన సంఘం నాయకుడు ఉన్నాడు. ఆయన పేరును వై.యస్.జగన్మోహన్ రెడ్డి గా మార్చి పేరుతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోను యాడ్ చేసినట్టు చెబుతున్నారు అయితే మరి కొంతమంది వాదన మరోలా ఉంది..
🔴నిజమే కావొచ్చు తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించారే తప్ప ఎక్కడ నందమూరి బాలకృష్ణను విమర్శించి చిన్న మాట కూడా మాట్లాడ లేదు. దీంతోతెలుగు దేశం నేత హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ అంటే.. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇష్టమనే విషయం తాజాగా మరోసారి రుజువైంది. అని వారు వాదిస్తున్నారు. ఇది నిజమే కావచ్చు అని మరి కొందరు వాదిస్తున్నారు.
🔴అదే విషయం నిజమైతే తాజాగా ఏపీ అసెంబ్లీ ..లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే.. బాలయ్య మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం కొసమెరుపు.
🔴మరి రెండు వర్గాలు వారు చేస్తున్న ఈ ప్రచారంలో ఎవరు నిజం చెబుతున్నారు ,ఎవరు అబద్ద ప్రచారం చేస్తున్నారనే విషయంలో క్లారిటీ రావాలంటే జగన్, బాలయ్య ఇద్దర్లోఎవరో ఒకరు నోరు విప్పాలి . చూద్దాం ముందుగా ఎవరు స్పందిస్తారో..ఎలా స్పందిస్తారో..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.