“ఎవరు”.హిట్టా..? ఫట్టా..?

evaru movie talk
Spread the love

Teluguwonders:

చిత్రం: ఎవరు

నటీనటులు: అడివిశేష్‌, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

మాటలు: అబ్బూరి రవి

దర్శకత్వం: వెంకట్ రాంజీ

నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె

విడుదల తేదీ: 15-08-2019

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ థ్రిల్లర్ చిత్రాలే.

ఒకప్పుడు వీటిని తక్కువ బడ్జెట్ తో తీసేవారు. అలాంటిది ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వీటిపైనే పడ్డారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా నచ్చుతున్నాయి. ఎందుకంటే వాళ్ళని థ్రిల్ చేస్తేనే సినిమాలు ముందుకు వెళ్తాయి. టాలీవుడ్ లో ఇలాంటి చిత్రాలు వీక్షించే సంఖ్యా కూడా పెరిగిపోయింది. ఈ ఆగష్టు 15 నాడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన చిత్రం ‘ఎవరు’. ఇందులో కధానాయకుడిగా అడవిశేష్ నటించాడు. ఇతడు ఇదివరకే `క్షణం`, `గూఢచారి` చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు. అదే తరహాలో ఇప్పుడు ఈ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు.

ఇక కధ విషయానికి వస్తే.. రెజీనా (సమీరా) గా ప్రముఖ బిజినెస్ మాన్ భార్య. ఒక రిసెప్షనిస్టు గా ప్రారంభమైన తన జీవితం అంచలంచలుగా ఎదుగుతుంది. సమీరా అనుకోకుండా నవీన్‌చంద్ర (డీఎస్పీ అశోక్) ని మర్డర్ చేస్తుంది. నన్ను చంపాలని ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కొరకు కాల్చానని తను చెబుతుంది. అనంతరం ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక అవినీతి అధికారిగా నిందపడ్డ పోలీస్ ఆఫీసర్ అడివి శేష్‌ (విక్రమ్ వాసుదేవ్) వస్తాడు. వచ్చిన వెంటనే సమీరా నుండి లంచం కూడా తీసుకుంటాడు. ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలు సమీరాను అడిగి తెలుసుకుంటాడు. కాని తన చెప్పిన సమాచారం..విక్రం సేకరించిన దానికి తేడా ఉండడంతో అసలు నిజం దాస్తున్నారంటూ నిజం రాబట్టాలని ప్రయత్నిస్తాడు. మరి అసలు నిజం నిజం చెబుతుందా..? అశోక్ ని సమీరా నిజంగా చంపిందా..? అనేది స్టొరీ. ఇందులోని కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తాయి.

బలాలు:

*చిత్రంలోని సస్పెన్స్ లు

*నటీనటులు

బలహీనతలు:

*సస్పెన్స్ సన్నివేశాల్లో కొంచెం గందరగోళం

*కొన్ని సన్నివేశాలు ముందుగానే తెలుస్తాయి.

రేటింగ్: 3.2/5

Advertisements

Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading