అన్నయ్య ను వెతుక్కుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్

Pawan Kalyan says about syeraa movie
Spread the love

Teluguwonders:

🔥ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి :

సింహం గురించి వేటగాడు చెప్పడం కాదు.. సింహమే బయటకు వచ్చి తనను గురించి తను చెప్తే కథ వేరేలా ఉంటుంది. అలాంటి సింహం కతే ఈ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి.

🔴మెగాస్టార్ 64 వ జన్మదిన వేడుకలు – ముఖ్య అతిథిగా పవర్ స్టార్:

మెగాస్టార్ చిరంజీవి 64 పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో తాను నటించకపోయినా.. నా గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్.

👉🔴ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..:

‘మాకు కొణెదల అనే ఇంటి పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. నేను ఎప్పుడూ అడిగేవాడిని. అయితే కర్నూల్ జిల్లా నందికొట్కూరులో కొణెదల గ్రామం ఉంది. ఈ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కూడా కర్నూల్ ప్రాంత వాసి. ఈ సినిమా తెచ్చుకున్నది కాదు.. అన్నయ్యను వెతుక్కుంటూ వచ్చింది. అన్నయ్య చేస్తేనే న్యాయం జరుగుతుందని ఈ సినిమా మెగాస్టార్ దగ్గరకు వచ్చింది. భారత దేశపు చరిత్రకారులు మరిచి పోయారేమో.. కాని తెలుగునేల.. రేనేల ఈ కొణెదల మరిచిపోలేదు మరిచిపోలేదు ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ని. ఈ కథ మన అందరికీ స్పూర్తిదాయకం’

👉రామ్ చరణ్ ది గొప్ప ప్రయత్నం :

ఎవరైనా తండ్రి కొడుకుని లాంఛ్ చేస్తాడు.. 150 సినిమాతో తండ్రిని కొడుకు రీ లాంఛ్ చేశాడు. ఇప్పుడు ప్రపంచ మొత్తం చెప్పుకునే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను రామ్ చరణ్ తెరపై ఆవిష్కరిస్తున్నాడు.

నిర్మాతను కూడా ఎవరో బయటి వారిని పెట్టుకోలేదు. ఒక కొణెదెల ఇంటిపేరు పెట్టుకున్న రామ్ చరణ్ ఈ సినిమాని చేస్తున్నారు. ఒక తమ్ముడిగా నేను చేయలేని పనిని నా తమ్ముడు లాంటి వాడు చరణ్ చేశారు. మా అన్నయ్యతో నాకు ఇలాంటి ఒక చారిత్రాత్మక సినిమా ఉండాలని కోరుకున్నాను కాని.. నాకు శక్తి, సమర్ధత లేకపోయాయి. కాని నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ చేయగలిగాడు.

ఇలాంటి సినిమాలో వస్తే.. చిరంజీవి మాత్రమే ఆ పాత్రను చేయాలి.. తీస్తే రామ్ చరణ్ మాత్రమే తీయాలి. అందుకునే ఆ సినిమాకి ఎన్ని వందల కోట్లు అయినా వెనకడుకు వేయలేదు.

దర్శకుడు సురేందర్ రెడ్డి కల ఇది. ఈ చిత్రం ద్వారా తన కలను సాకారం చేసుకున్నారు. అన్నయ్య హీరోగా.. రామ్ చరణ్ నిర్మాతగా ఇలాంటి చక్కటి చిత్రం ద్వారా మన చరిత్రను మనం స్మరించుకునే అవకాశం వచ్చింది ” అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *