నిశ్శబ్దంగా…11న ఫస్ట్ లుక్ ..!!

Spread the love

Teluguwonders:

నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్‌గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసుకుంది. సెప్టెంబర్ 11న ఉదయం 11.11 గంటలకు ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఓ పోస్టర్‌తో ప్రకటించింది. కథాపరంగా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలో విదేశీ నటుడు మైఖేల్ మ్యాడ్సన్, మాధవన్, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

గోపీసుందర్ సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని చిత్రబృందం చెబుతోంది. తెర పై అనుష్క కనిపించి చాలా రోజులే అయింది . అప్పుడెపుడో వచ్చిన భాగమతి సినిమాలో కనిపించిన అనుష్క మళ్ళీ కనిపించింది లేదు .. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అనుష్క స్క్రీన్ పై కనిపించనుంది . అనుష్క నిశ్శబ్దం అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది . ఈ సినిమా షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది . అయితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లుక్ ని నిర్మాతలు విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసారు .

అమెరికాలోని సియాటల్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్‌లోనే జరగనుంది. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు మలయాళం.. ఈ 5 భాషల్లో ఈ సంవత్సరం చివరిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading