సెన్సేషనల్ న్యూస్ : డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ

Spread the love

Teluguwonders:

బోయపాటి శ్రీనుతో బాలయ్య మూడో సినిమా ప్రకటన వచ్చింది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు బ్లాక్ బస్టర్లు ‘సింహా’, ‘లెజెండ్’ వచ్చాయి. తరవాత మరో పవర్ ఫుల్ స్టోరీతో నందమూరి నటసింహం రానున్నాడు.

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరో పవర్ ఫుల్ స్టోరీతో బాలకృష్ణను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమైపోయారు.

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బ్లాక్ బ‌స్టర్స్‌ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారికి బాలయ్య తీపి కబురు అందించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ వచ్చేస్తోంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది.

బాల‌కృష్ణ కోసం ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీను మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. 👉ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ ఈ నిర్మిస్తున్నారు. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. సెప్టెంబ‌ర్ 5 నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ జరుగుతోంది. బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో ఈ చిత్రంలో క‌న‌ప‌డతారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నారు.

💥సోషల్ ప్రాబ్లం ఆధారంగా బోయపాటి మూవీ :

క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రస్తుతం స‌మాజంలోని ప్రధాన‌మైన స‌మ‌స్య ఆధారంగా చేసుకుని బోయ‌పాటి శ్రీను అద్భుత‌మైన క‌థ‌ను సిద్ధం చేశారు. డిసెంబ‌ర్ నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి 2020 వేస‌వి చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇది వ‌ర‌కు బాల‌కృష్ణ, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాల్లో నందమూరి నటసింహం ప‌వ‌ర్‌ఫుల్ లుక్స్ అంద‌రినీ మెప్పించాయి. అలాంటి మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో బాల‌కృష్ణను చూపించ‌నున్నారు డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ‌క్షన్ నెం.3గా నిర్మించ‌నున్నారు. త్వర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను చిత్ర యూనిట్ ప్రక‌టిస్తుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading