సందడిగా రెడీ అవుతున్న డిస్కో రాజా

Spread the love

Teluguwonders:

డిస్కో రాజా :

ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది .

మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ ‘డిస్కో రాజా’. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 20న ‘డిస్కో రాజా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

🔴టైటిల్ నేమ్ ఆర్ట్ :

కాగా, ఈ సినిమా తాజాగా గోవా షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, ఆర్ట్ డైరెక్టర్ నరేంద్ర గోవా బీచ్‌లో చెక్కిన సైకత శిల్పం ఫొటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘డిస్కో రాజా’ టైటిల్ లోగోను నరేంద్ర సైకత శిల్పంగా సముద్ర తీరంలో నిర్మించారు. ఈ సాండ్ ఆర్ట్ చాలా బాగుంది. అలాగే, సెట్స్‌లో రవితేజ లేటెస్ట్ పిక్ ఒకదానిని కూడా చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో రవితేజను వెనక నుంచి చూపించారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.. చిత్ర టీజర్ కోసం రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి వినూత్న కాన్సెప్ట్స్‌తో చిత్రాలు తెరకెక్కించిన వి ఐ ఆనంద్.. రవితేజతో సరికొత్త ప్రయోగం చేస్తున్నట్లు తెలిసింది. ‘నేల టిక్కెట్’తో నష్టపోయిన రామ్ తాళ్లూరికి ఈ సినిమాతో లాభాలు తెచ్చిపెట్టాలని రవితేజ చూస్తున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading