2 ఏళ్లలో 6 హిట్లు..ఈ హీరో తోపు!!

6 hits in 2 years
Spread the love

Teluguwonders:

ఇక్కడ మన హీరోలలో ఒక్కో హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్న స్టార్లు ఉన్నారు. బాలీవుడ్ లో కోలివుడ్ లో ఎక్కడ కూడా సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తూ ఒకటి కి మించిన హిట్లు కొట్టాలి అంటే ప్రతీ స్రిప్ట్ సక్సెస్ ఫుల్ అవ్వలాని రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు ఒక హీరో కి ఇలాంటి లక్ ఉన్నట్లు ఉంది. చిన్న హీరో నే అయినా పెద్ద హీరోల రేంజ్ హిట్స్ ని పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నాడు.

ఆ హీరోనే ఆయుష్ మాన్ ఖురానా. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ హ్యాప్పేనింగ్ హీరో ఎవరు అంటే ఈయనే అని చెప్పాలి. ఒకటి కాదు 2 కాదు ఏకంగా వరుసగా 6 హిట్లతో డబుల్ హాట్రిక్ హీరోగా దూసుకు పోతూ తోపు అనిపించుకుంటు సంచలనం సృష్టిస్తున్నాడు ఈ హీరో.

రెండేళ్ళ క్రితం దం లగాకే హైసా అంటూ సూపర్ హిట్ కొట్టినా తర్వాత మేరీ ప్యారీ బిందు తో ఫ్లాఫ్ కొట్టాడు ఈ హీరో కానీ తర్వాత టోటల్ జాతకం మారిపోయింది. బరేలీ కి బర్ఫీ, శుబ్ మంగళ్ సావ్ దాన్, అందాదూన్, భాదాయ్ హో, ఆర్టికల్ 15 మరియు ఇప్పుడు డ్రీం గర్ల్ తో మరో హిట్ కొట్టాడు.

ఇలా ఒకట తర్వాత ఒకటి 6 సూపర్ హిట్ల ని తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. లాస్ట్ ఇయర్ చేసిన భాదాయ్ హో స్టార్ హీరోల సినిమా ల కన్నా కూడా లాంగ్ రన్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించగా మరో సినిమా అందాదూన్ కి గాను ఇంటర్నేషనల్ వైడ్ గా పేరు సొంతం చేసుకున్నాడు.

చైనా లో ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ ఇయర్ ఇప్పటికే 2 హిట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఫ్యాచర్ లో కూడా తన హిట్ స్ట్రీక్ ని ఇలాగే కొనసాగిస్తానని, గట్టి నమ్మకంతో ఉన్నాడు. తన లేటెస్ట్ మూవీ డ్రీం గర్ల్ ఇప్పటికే 50 కోట్లు దాటగా త్వరలోనే 100 కోట్లు అందుకోవడం పక్కా అంటున్నారు.

Advertisements

Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading