‘సైరా’ లో పవన్ డీటెయిల్స్ రివీల్ చేసిన రామ్ చరణ్

Ram Charan Revealed Pawan Details in SYERAA
Spread the love

Teluguwonders:

మెగా అభిమానులకు మెగా న్యూస్ ఏది విన్నా ఆ రోజు వారికీ పండగ రోజునే చెప్పాలి. Sye Raa Trailer: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ మొన్న హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో విడుదలైంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడంతో యూట్యూబ్ షేక్ అవుతోంది.
విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో ‘సైరా నరసింహారెడ్డి’గా చిరంజీవి ఉగ్రరూపం దాల్చారు.

💥పవన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం :

ఇక ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు చిత్ర నిర్మాత రామ్ చరణ్. సైరా టీజర్‌లో పవన్ కళ్యాణ్ వాయిస్‌ను ఉపయోగించుకున్నారు. సినిమాలో కూడా ఉంటుందా? అని విలేకరి అడగ్గా.. రామ్ చరణ్ ఏంటి మళ్లీ అడగండి అంటూ.. దర్శకుడు సురేందర్ రెడ్డిని చెప్పొచ్చా అని పర్శిషన్ తీసుకుని.. సినిమాలో కూడా పవన్ వాయిస్ ఉంటుందని సీక్రెట్ రివీల్ చేశారు. 👉దాంతో జై పవర్ స్టార్ అంటూ నినాదాలు మారుమోగాయి. కాగా సైరా సినిమాలో సురేందర్ రెడ్డి టేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండంటంతో ‘సైరా’ బాక్సాఫీస్‌ రికార్డుల్ని బ్రేక్ చేయడం ఖాయమే అంటున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading